-

ఎఫ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడిగా సి. కల్యాణ్‌

22 Dec, 2016 23:43 IST|Sakshi
ఎఫ్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడిగా సి. కల్యాణ్‌

గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారతీయ చలనచిత్ర సమాఖ్య (ఎఫ్‌.ఎఫ్‌.ఐ.) అధ్యక్షునిగా సి. కల్యాణ్, ఉపాధ్యక్షునిగా కొడాలి వెంకటేశ్వర రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎఫ్‌.ఎఫ్‌.ఐ.లో భారతీయ చలన చిత్ర నిర్మాతలు, పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు, స్టూడియోలు –థియేటర్ల ఓనర్లు సభ్యులు. ప్రస్తుతం కల్యాణ్‌ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా, వెంకటేశ్వరరావు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా పదవులు నిర్వహిస్తున్నారు.