బిగ్‌బాస్‌.. వాళ్లిద్దరి మధ్య మొదలైన వార్‌!

23 Jul, 2019 17:33 IST|Sakshi

అడుగుపెట్టిన మొదటిరోజే నామినేషన్స్‌ ప్రక్రియ మొదలుపెట్టిన బిగ్‌బాస్‌.. కంటెస్టెంట్స్‌ మధ్య చిచ్చును పెట్టాడు. మొదటగా ఇంట్లోకి ప్రవేశించిన శివజ్యోతి, రవికృష్ణ, అషూ రెడ్డిలు మిగతా ఇంటి సభ్యులను ఎంట్రీలోనే ప్రశ్నలు అడగటం, దాంట్లోంచి సరైన సమాధానాలు చెప్పని ఆరుగురు సభ్యుల పేర్లను చెప్పమని బిగ్‌బాస్‌ ఆదేశించడం, దాంతో రాహుల్‌, వరుణ్‌  సందేశ్‌, వితికా షెరు, శ్రీముఖి, బాబా భాస్కర్‌, జాఫర్‌లు ఈ వారం నామినేట్‌ అవ్వడం తెలిసిందే. 

వారంతా నామినేషన్స్‌ నుంచి తప్పించుకునేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చిన బిగ్‌బాస్‌ అందుకు ఓ మెలిక పెట్టాడు. తనకు బదులుగా ఇంకో ఇంటిసభ్యుడిని నామినేట్‌ చేయాల్సిందిగా సూచించాడు. సరైన కారణాలను వివరిస్తూ సదరు ఇంటి సభ్యుడిని నామినేట్‌ చేయాలని, అటువైపు ఉన్న  కంటెస్టెంట్‌ నామినేషన్‌ నుంచి తనను తాను కాపాడుకోవడానికి కూడా అవకాశమిచ్చాడు. అయితే ఈ వ్యవహారంలో ఆరుగురు సభ్యులు చర్చించుకుని హేమను న్యాయనిర్ణేతగా(మానిటర్‌)  ఎంచుకున్న సంగతి తెలిసిందే.

అయితే నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో హేమకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కాసేపటి క్రితం విడుదల చేసిన ప్రోమోనే తెలియజేస్తోంది. ఆ ఆరుగురు కంటెస్టెంట్లలో.. బెల్‌ మోగిన ప్రతీసారి మిగతా ఇంటి సభ్యుల్లోంచి ఒకరిని తమకు బదులుగా నామినేట్‌ చేయవచ్చు. ఈ ప్రాసెస్‌లో ఎవరి వాదనను వారు వినిపించవచ్చు. కానీ చివరకు హేమదే తుది నిర్ణయమని తెలిసిందే. ఈ వ్యవహారంలోనే  హేమ-హిమజల మధ్య వార్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. ఎవరి పనులను వారు చేయాలని, హౌస్‌లో రూల్స్‌ను పాటించడం లేదని హేమ ఇంటి సభ్యులతో అనడం, వంటగదిలో తనకు పనేంటని? హిమజపై ఫైర్‌ అయింది. తనపై నిందలు వేస్తే ఊరుకోనని హిమజ కూడా ఘాటుగానే స్పందించింది. మరి వీరి గొడవ ఎక్కడి వరకు వెళ్లింది. చివరకు నామినేట్‌ అయిన ఆరుగురిలో వేరే ఇంటి సభ్యులు ఎవరైనా రీప్లేస్‌ అయ్యారా? లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు