కుల్మీత్‌ మక్కర్‌ మృతి;  విద్యాబాలన్‌ దిగ్ర్బాంతి

1 May, 2020 11:36 IST|Sakshi

ధర్మశాల : బాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఇర్ఫాన్‌ ఖాన్‌, రిషి కపూర్‌లను కోల్పోయిన బాలీవుడ్‌కు మరో షాక్‌ తగిలింది. ప్రముఖ నిర్మాత, టెలివిజన్‌ అండ్‌ సినిమా ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో కుల్మీత్‌ మక్కర్‌(60) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుల్మీత్‌ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్‌ విధించకముందే ఇంట్లోనే గుండెపోటుకు గురైన కుల్మీత్‌ అప్పటినుంచి ధర్మశాలలోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
(‘మీ దగ్గరికి వచ్చే దాకా మిమ్మల్ని మిస్‌ అవుతాను’)

ఈ సందర్భంగా పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు ఆయన మృతి పట్ల ట్విటర్‌ వేదికగా తమ నివాళి ప్రకటించారు. కాగా నివాళులు అర్పించిన వారిలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌, ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్‌ జోహర్‌, దర్శకులు హన్సల్‌ మెహతా, సుభాష్‌ గాయ్‌ తదితరులు ఉన్నారు. బాలీవుడ నటి విద్యాబాలన్‌ స్పందిస్తూ.. ' ఇది నిజంగా షాకింగ్‌.. ఇండస్ట్రీకి మీరు అందించిన సేవలు ఎప్పటికి గుర్తుంచుకుంటాం. మా కన్నీటితో ఇవే మీకు మా ఘన నివాళులు. నా తరపున మీ కుటుంబసభ్యులకు ప్రగాడ సానభూతి తెలియజేస్తున్నా' అంటూ ట్వీట్‌ చేశారు. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ స్పందిస్తూ.. ' ప్రొడ్యూసర్‌ గిల్డ్‌ ఆఫ్‌ సీఈవోగా మీరు నిస్వార్థ సేవలందించారు. పని పట్ల మీకున్న విశ్వసనీయతను ఎల్లప్పుడు గుర్తుంచుకుంటాం. అలాంటి మీరు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లడం చాలా బాధాకరం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్‌ చేశారు.
(ఆసుప‌త్రిలో ఆశీస్సులు అందిస్తోన్న‌ రిషి క‌పూర్)

'అసలు బాలీవుడ్‌కు ఏమైంది.. వరుస విషాదాలు మమ్మల్ని వెంటాడుతున్నాయి. కుల్మీత్‌ మక్కర్‌ !  మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ దర్శకుడు హన్సల్‌ మెహతా పేర్కొన్నారు. మక్కర్‌ మూడు దశాబ్ధాలుగా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీల్డ్‌లోనే ఉన్నారు. కుల్మీత్‌ సినిమా, టెలివిజన్‌ ఫీల్డ్‌లో ఎన్నో పదవులను స్వీకరించారు. కుల్మీత్‌ సారేగమా, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో వివిధ హోదాల్లో పని చేశారు. బిగ్‌ మ్యూజిక్‌ అండ్‌ హోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను స్థాపించి కొంతకాలం సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా సీఈవోగా ఉన్నారు.

మరిన్ని వార్తలు