త్వరలో మహేష్‌బాబుతో సినిమా: దర్శకుడు పరశురామ్‌ 

26 Dec, 2019 09:57 IST|Sakshi
సినీ దర్శకుడు పరశురామ్‌కు ప్రసాదం అందిస్తున్న ఏఈవో రామారావు

‘గీతగోవిందం’ ప్రేక్షకులను దగ్గర చేసింది  

అప్పన్నను దర్శించుకున్న సినీ దర్శకుడు పరశురామ్‌ 

సింహాచలం(పెందుర్తి): గీత గోవిందం సినిమా తనని సినీ ప్రేక్షకులను ఎంతో దగ్గర చేసిందని దర్శకుడు పరశురామ్‌ అన్నారు. వరాహ లక్ష్మీ నృసింహస్వామిని బుధవారం ఆయన సతీసమేతంగా దర్శించుకున్నారు. అంతరాలయంలో అష్టోత్తరం పూజ, గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. వేద ఆశీర్వచనాన్ని అర్చకులు అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాన్ని ఏఈవో రామారావు అందించారు. ఈ సందర్భంగా పరశురామ్‌ విలేకరులతో మాట్లాడారు. ‘యువత’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యానని, ఆ తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు, గీతగోవిందం సినిమాలకు దర్శకత్వం వహించానన్నారు. గీత గోవిందం సినిమా ప్రేక్షకులను బాగా దగ్గర చేసిందన్నారు. తన తదుపరి చిత్రం నాగచైతన్యతో ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోందన్నారు. అలాగే మహేష్‌బాబుతో సినిమా ఉంటుందని, ఆ సినిమా కథ ఇప్పటికే సిద్ధమైందన్నారు. నర్సీపట్నం తన సొంత ఊరని పరశురామ్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు