త్వరలో షూటింగ్స్‌కి అనుకూలంగా జీవో

4 Jun, 2020 03:49 IST|Sakshi
సి.కల్యాణ్, తలసాని సాయికిరణ్, అభిషేక్‌ నామా

‘‘తలసానిగారితో నాది 30ఏళ్ల అనుబంధం. రాజకీయంగా ఆయన ఎదిగినా మాతో రిలేషన్‌ మాత్రం అలానే ఉంది. సినీ కార్మికులకు అండగా ఉండి నిత్యావసరాలను ఇచ్చారు. సీఎం కేసిఆర్‌గారు కూడా పరిశ్రమ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. త్వరలోనే సినిమా చిత్రీకరణలకు అనుకూలంగా జీవోను ఇవ్వనున్నారు’’ అన్నారు ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌. తలసాని ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తలసాని శ్రీనివాస్‌ యాదవ్, తలసాని సాయికిరణ్‌ సినీ కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్న విషయం తెలిసిందే.

బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయికిరణ్‌ మాట్లాడుతూ –‘‘తెలంగాణాను సాధించటంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా కేసిఆర్‌గారు నడిపిస్తున్నారు. అలాగే సినీ పరిశ్రమ మీద కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ  పెట్టారు. తలసాని శ్రీనివాస్‌ గారికి సినిమాలంటే ప్రేమ. ప్రతి సినిమానూ తొలి రోజే చూస్తారు.  చిరంజీవి, నాగార్జున, మిగతా అసోషియేష¯Œ ్స అంతా కలిసి లీడ్‌ తీసుకుని సినిమాల చిత్రీకరణ గురించి మాట్లాడటానికి సమావేశాలు ఏర్పాటు చేశారు. సీసీసీ ద్వారా, మా ట్రస్ట్‌ ద్వారా సినీ కార్మికులను ఆదుకుంటాం’’ అన్నారు. నిర్మాత అభిషేక్‌ నామా కూడా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు