ఇర్ఫాన్‌ఖాన్‌ మృతి పట్ల సినీ ఇండస్ట్రీ నివాళి

30 Apr, 2020 01:35 IST|Sakshi
ఇర్ఫాన్‌ ఖాన్‌

ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణవార్త విని సోషల్‌ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు తమ బాధను వ్యక్తం చేశారు. ఆ ట్వీట్స్‌ ఈ విధంగా..

► ఇర్ఫాన్‌ ఖాన్‌ లేరనే వార్త నన్ను ఎంతో బాధించింది. ప్రపంచ వ్యాప్తింగా పాపులారిటీ సాధించిన అద్భుతమైన నటుడు ఇర్ఫాన్‌. ఆయన లోటుని ఎవ్వరూ భర్తీ చేయలేరు. ఇర్ఫాన్‌ నటన మన అందరి గుండెల్లో నిలిచిపోతుంది. ఇర్ఫాన్‌. మేమందరం నిన్ను మిస్‌ అవుతాం.
– చిరంజీవి
     
► ప్రపంచ సినిమా ఓ గొప్ప నటుడిని కోల్పోయింది. ఇర్ఫాన్‌తో కలసి నటించే అవకాశం రాలేదు. ఆయన సినిమాలన్నీ చూసి, చెప్పగలిగేది ఏంటంటే ఆయనో అద్భుతమైన నటుడు. మీ సినిమాల ద్వారా మిమ్మల్ని చిరకాలం గుర్తుంచుకుంటాం.
– వెంకటేష్‌
     
► ఇర్ఫాన్‌ ఖాన్‌ నటన నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. నాకు తెలిసిన గొప్ప నటుల్లో ఇర్ఫాన్‌ ఒకరు. మనల్ని విడిచి ఆయన చాలా తొందరగా వెళ్లిపోయారు. ఇంకొంతకాలం జీవించి ఉండాల్సింది.

– కమల్‌హాసన్‌

► ఇర్ఫాన్‌ఖాన్‌ మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.
– మోహన్‌లాల్‌

► గొప్ప నటుడు. చాలా త్వరగా మనందర్నీ విడిచి వెళ్లిపోయారు. ఆయన తో పని చేయడం ఓ మంచి అనుభవం, ఎప్పటికీ మరచిపోలేని అనుభూతి.  ఆయన కుటుంబ సభ్యులకు, ప్రేమించిన వారికి నా హుదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను .
– మహేష్‌ బాబు

► ప్రపంచ సినిమా ఒక ఆణిముత్యం లాంటి నటుడిని కోల్పోయింది. ఇర్ఫాన్‌గారు అత్యద్భుతమైన నటులు. సినిమా ఇండస్ట్రీ ఈ లెజెండ్‌ ను కచ్చితంగా మిస్‌ అవుతుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
– రామ్‌ చరణ్‌

► మన దేశంలోనే ఉన్న గొప్ప నటుల్లో ఇర్ఫాన్‌ గారు ఒకరు. ఆయన చనిపోయారనే వార్త వింటుంటే చాలా బాధగా ఉంది. ఎన్నో మర్చిపోలేని పాత్రలను పోషించారాయన. ï్రÜ్కన్‌ మీద ఆయన్ను మిస్‌ అయినా, ఆయన సినిమాల ద్వారా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం.
– విష్ణు మంచు

► చాలా బాధగా ఉంది. చాలా త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు ఇర్ఫాన్‌. ప్రపంచ కళా రంగానికి నువ్వు చేసిన కృషికి ధన్యవాదాలు.
– ప్రకాష్‌ రాజ్‌

► మీరు (ఇర్ఫాన్‌ ఖాన్‌) ఇంటర్‌నేషనల్‌ స్టార్‌. ఒక లెజెండ్‌. గొప్ప ప్రతిభావంతులు. మీతో కలిసి ‘కర్వాన్‌’ సినిమాలో నటించడాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు అందరినీ సమానంగా చూశారు. మీ కుటుంబసభ్యులుగా భావించారు. ఒక అభిమానిగా, ఒక విద్యార్థిగా ఆ క్షణాలను నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మీ నవ్వును నేను మర్చిపోలేను. మీరు లేరన్న వార్తను భరించలేకపోతున్నాను.
– దుల్కర్‌ సల్మాన్‌

► ఇర్ఫాన్‌ ఖాన్‌ మృతి చెందారన్న దుర్వార్త నన్నెంతగానో కలచివేసింది. ఇండస్ట్రీకి ఇర్ఫాన్‌ లేని లోటు తీరనిది. అద్భుతమైన నటుడు. ప్రపంచ సినిమాకు తన వంతు సేవ చేసి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. మనల్ని చాలా తొందరగా వదిలి వెళ్లిపోయాడు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.         
– అమితాబ్‌ బచ్చన్‌

► నా సహచర నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణించారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చాలా బాధగా ఉంది. ప్రతిభావంతుడు. తన నటనతో ఆయన మనందరికీ ఎప్పుడూ గుర్తుంటారు. ప్రేమతో మిమ్మల్ని (ఇర్ఫాన్‌ ఖాన్‌) గుర్తుపెట్టుకుంటాం.                
 – ఆమిర్‌ఖాన్‌

► ఈ కాలంలోనే గొప్ప నటుడు, నా ప్రేరణ, నా మిత్రుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ మరణం నన్ను ఎంతో బాధించింది. మీరు కనబర్చిన అద్భుత నటనతో మా జీవితాల్లో ఎప్పటికీ మీరు (ఇర్ఫాన్‌ ఖాన్‌) భాగమయ్యే ఉంటారు.
– షారుక్‌ ఖాన్‌

► ఇర్ఫాన్‌ ఇక లేరన్నది ఫిల్మ్‌ ఇండస్ట్రీకి తీరని లోటు. అతని కుటుంబం, అభిమానులకు కూడా. మనందరి హృదయాల్లో ఇర్ఫాన్‌ ఎప్పటికీ బతికే ఉంటారు
– సల్మాన్‌ ఖాన్‌

► ఇర్ఫాన్‌గారితో నేను ఎక్కువ సందర్భాల్లో మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ ఈ ట్వీట్‌ టైప్‌ చేసేప్పుడు నా కళ్లు కన్నీటితో నిండిపోయాయి. అరుదైన మానవతావాది. మిమ్మల్ని (ఇర్ఫాన్‌) చాలా మిస్‌ అవుతున్నాను. అవుతున్నాను.
– హృతిక్‌ రోషన్‌

► ఇర్ఫాన్‌ మరణించారన్న వార్త విని చాలా కలత చెందాను. మా తరంలోనే చాలా గొప్ప నటుడు. ఈ కష్టకాలంలో ఆ దేవుడు అతని కుంటుంబానికి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను
– అక్షయ్‌ కుమార్‌

► గొప్ప నటుడిని మనం కోల్పోయాం. ఇర్ఫాన్‌ చివరి వరకు పోరాడుతూనే ఉన్నాడు. ఆయన్ను చాలా మిస్‌ అవుతాం. ఇర్ఫాన్‌ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
– బోనీకపూర్‌

► ఇర్ఫాన్‌ నా ప్రియమైన స్నేహితుడు. జీవితంతో ఇర్ఫాన్‌ పోరాడిన తీరుకు ఆయన స్నేహితుడిగా నేను గర్వపడుతున్నాను. ఇర్ఫాన్‌కు నా సెల్యూట్‌
– సుజిత్‌ సర్కార్‌

► మీ (ఇర్ఫాన్‌ఖాన్‌) శకాన్ని ప్రపంచం ఎప్పటికీ మర్చిపోదు. నా స్నేహితుడు ఇర్ఫాన్‌ జీవితంతో ఓ యోధుడిలా పోరాడారు.
– ప్రియాంకా చోప్రా

► మీతో (ఇర్ఫాన్‌) నాకు అంతగా పరిచయం లేదు. కానీ నా శోకాన్ని ఆపుకోలేకపోతున్నాను.. ఎందుకంటే మీ నటన నా వృత్తి జీవితంపై చూపిన ప్రభావం అలాంటిది. నటనలో మీరు చేసిన మ్యాజిక్‌ మిమ్మల్ని మాకు ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటుంది.
– విద్యాబాలన్‌

► నా ప్రియమిత్రుడు ఇర్ఫాన్‌ఖాన్‌ మరణం నన్ను బాధించింది. ఇర్ఫాన్‌ ప్రతిభా వంతుడు, నిజాయితీపరుడు, ధైర్యవంతుడు.
– ఐశ్వర్యారాయ్‌

► ఈ రోజు(బుధవారం) చాలా ధుర్ధినం. స్వయంకృషితో బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి లీడ్‌ యాక్టర్‌గా ఆస్కార్‌ స్థాయి నటన కనబరచారు.  
– కంగనా రనౌత్‌

► ఇర్ఫాన్‌మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. నా హృదయం బద్దలైపోయింది.
– దీపికా పదుకోన్‌

► ఇర్ఫాన్‌గారితో కలిసి పనిచేయడాన్ని ఓ గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.
– కరీనా కపూర్‌

► నాలో ఆత్మవిశ్వాసం తగ్గిన సమయంలో మీరు నాకు చెప్పిన మాటలు నాలో ఎంత ధైర్యాన్ని నింపాయో మాటల్లో చెప్పలేను ఇర్ఫాన్‌ సర్‌. ఇకపై మీరు లేరన్న విషయం నన్ను ఎంతగానో బాధిస్తోంది
– సోనమ్‌ కపూర్‌

► ఇర్ఫాన్‌గారు వెండితెర ఇంద్రజాలికులు. మాలాంటి వారికి స్ఫూర్తి. ఆయనతో కలిసి నటించడాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను.
– శ్రద్ధాకపూర్‌

► నాకు తెలిసిన స్ట్రాంగెస్‌ ్టపీపుల్‌లో ఇర్ఫాన్‌గారు ఒకరు. ఆయన ఒక ఫైటర్‌. ఇర్ఫాన్‌గారు నటించిన కాలంలోనే మా జర్నీ కూడా సాగిందని గర్వంగా చెప్పుకుంటాం.
– రాధికా మాధన్‌ (‘అంగ్రేజీ మీడియం’ సినిమాకు ఇర్ఫాన్‌ కో స్టార్‌)

► ఇర్ఫాన్‌ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. బాధలోనూ సానుకూలంగా ఆలోచించగల వ్యక్తి. చివరిసారిగా మేం కలిసినప్పుడు మానవాళి ఉనికికి సంబంధించిన విషయాలను చర్చించుకున్నాం.
– కొలిన్‌ (జురాసిక్‌ వరల్డ్‌ 2015 డైరెక్టర్‌)

వీరితో పాటు మహేశ్‌ భట్, అలీ అబ్బాస్‌ జాఫర్, అనురాగ్‌ బసు, అర్జున్‌కపూర్, ఆయుష్మాన్‌ ఖురానా, రాజ్‌కుమార్‌ రావు, కార్తీక్‌ ఆర్యన్‌ వంటి సినీ ప్రముఖులు ఇర్ఫాన్‌ఖాన్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు