యువతరానికి 'భాగ్ మిల్కా భాగ్' స్పూర్తినిస్తుంది

3 Jul, 2013 21:08 IST|Sakshi
'యువతరానికి 'భాగ్ మిల్కా భాగ్' స్పూర్తినిస్తుంది'
యువతరానికి స్పూర్తి కలిగించే చిత్రంగా 'భాగ్ మిల్కా భాగ్' నిలుస్తుంది అని లెజెండరీ అథ్లెట్ మిల్కాసింగ్ అన్నారు. మిల్కాసింగ్ జీవిత కథా నేపథ్యంతో రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో మిల్కా సింగ్ పాత్రను బాలీవుడ్ నటుడు, దర్శకుడు ఫరాన్ అక్తర్  పోషిస్తున్నాడు. ఢిల్లీలో 'భాగ్ మిల్కా భాగ్' చిత్రం చూశాను.
 
ఈ చిత్రంలో ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు నాకు కనిపించలేదు. ఎందరో యువకులకు ఈ చిత్రం స్పూర్తిని కలిగించడం ఖాయం అని మిల్కాసింగ్ అన్నాడు. 'ఫ్లయింగ్ సిక్కు' గా పేరున్న మిల్కాసింగ్ ఈ చిత్ర ప్రీమియర్ ప్రదర్శన కోసం లండన్ వెళ్లనున్నాడు. మిల్కాసింగ్ తోపాటు ఫరాన్ అక్తర్, సోనమ్ కపూర్, మెహ్రా ఇతరులు ఇందులో పాల్గొంటారు. భాగ్ మిల్కా భాగ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 12 తేదిన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.