సినీ సమస్యల పరిష్కారానికి స్క్రీనింగ్‌ కమిటీ

7 Feb, 2017 23:11 IST|Sakshi
సినీ సమస్యల పరిష్కారానికి స్క్రీనింగ్‌ కమిటీ

‘‘తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ) ఏర్పాటుకి రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. చిత్రసీమలో సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, వాటి పరిష్కారానికి త్రిసభ్య కమిటీ వేశారు. సినీ కార్మికుల్లో సంతోషాన్ని నింపుతున్న కేసీఆర్‌గారికి కృతజ్ఞతలు’’ అన్నారు టీఎఫ్‌సీసీ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్‌. టీఎఫ్‌సీసీ ఏర్పాటై రెండేళ్లు పూరై్తన సందర్భంగా ఉపాధ్యక్షులు రంగా రవీంద్రగుప్తా, కార్యదర్శి ‘లయన్‌’ సాయివెంకట్‌లతో కలసి రామకృష్ణగౌడ్‌ మీడియాతో మాట్లాడారు.

‘‘టీఎఫ్‌సీసీలో వెయ్యిమంది నిర్మాతలు, ఇతర శాఖలను కూడా కలుపుకుని సుమారు 3000 మంది సభ్యులున్నారు. వారందరికీ హెల్త్‌ కార్డులు, సభ్యుల పిల్లలకు స్కాలర్‌షిప్‌ ఇప్పించనున్నాం. చిన్న చిత్రాలకు ఐదవ ఆట, చిత్రపురి కాలనీలో ఇల్లు లేనివారికి 9 ఎకరాల కేటాయింపు, ప్రభుత్వం తరపున ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటు వంటివి సీఎం దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలో జీవో వస్తుంది’’ అని రామకృష్ణగౌడ్‌ తెలిపారు.