-

మోదీజీ.. క్షమాపణలు చెప్పండి: దర్శకుడు

16 Oct, 2016 14:22 IST|Sakshi

ముంబై: గతేడాది డిసెంబర్లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లినందుకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ డిమాండ్ చేశాడు. పాకిస్థాన్ నటులు నటించిన సినిమాల ప్రదర్శనపై థియేటర్ల యజమానులు నిషేధం విధించడాన్ని ఆయన తప్పుపట్టాడు.

'నరేంద్ర మోదీ సార్, మీరు పాకిస్థాన్కు వెళ్లి ఆ దేశ ప్రధానిని కలిసినందుకు ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదు. మీరు గతేడాది డిసెంబర్లో పాక్కు వెళ్లారు. అదే సమయంలో కరణ్ జోహార్ ఏ దిల్ హై ముష్కిల్ సినిమా షూటింగ్ తీశారు' అని కశ్యప్ ట్వీట్ చేశాడు. ఉడీ ఉగ్రవాద దాడి, పీవోకేలో భారత సైన్యం సర్జికల్ దాడుల అనంతరం పాక్ నటులపై నిర్మాతల మండలి నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అలాగే పాక్ నటులు నటించిన సినిమాలను ప్రదర్శించబోమని థియేటర్ల యజమానులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పాక్ నటుడు నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమాకు కష్టాలు ఎదురయ్యాయి. కరణ్ జోహార్కు మద్దతుగా కశ్యప్ ట్వీట్ చేశాడు.