ఫిల్మ్‌మేకింగ్‌ అంటే కామన్‌సెన్స్‌

28 Nov, 2018 00:46 IST|Sakshi

∙చిన్నప్పుడే స్కూల్‌ ఎగ్గొట్టి మరీ మా అమ్మతో కలిసి సినిమాలు చూశాను. కానీ చదువును అశ్రద్ధ చేయలేదు. పదో తరగతిలో తొంభైశాతానికిపైగా మార్కులు సాధించాను. ఆ తర్వాత ఇంటర్‌ జాయిన్‌ అయ్యాక చదువు ఆపేద్దాం అనుకున్నా. నాన్నగారి మాటలతో బీటెక్‌ చేశాను. యూకేలో మాస్టర్స్‌ చేశా. అక్కడే ఫిల్మ్‌ కోర్స్‌ కంప్లీట్‌ చేసి సినిమాల వైపు వచ్చాను. ∙మన సొసైటీలో నచ్చింది చేయడం కష్టం. అదే నేను యూకేలో పుట్టి ఉంటే ఈ సినిమాను ఎప్పుడో తీసేవాడినేమో. యూకే నుంచి తిరిగొచ్చిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావ్‌ అని నా ఫ్యామిలీ మెంబర్స్‌ అడిగారు? వాళ్ల బలవంతంపై సివిల్స్‌లో జాయిన్‌ అయ్యాను.

అక్కడే ‘హుషారు’ స్క్రిప్ట్‌ రాశా. మధ్యలో హ్యాండ్‌ కెమెరాతో కొన్ని షార్ట్‌ ఫిల్మ్స్‌ కూడా తీశాను. ముందు ‘హుషారు’ చిత్రాన్ని సొంతంగా నిర్మిద్దాం అనుకున్నాం. సినిమాను రిలీజ్‌ చేయడం తీసినంత ఈజీ కాదని ఓ శ్రేయోభిలాషి చెప్పడంతో బెక్కెం వేణుగోపాల్‌గారిని కలిసి కథ చెప్పాను. ‘పెళ్ళిచూపులు’ సినిమాకు ముందు ఈ స్క్రిప్ట్‌ను విజయ్‌ దేవరకొండకు వినిపించాను. ఆయన ఓకే అన్నారు కూడా. ఆ తర్వాత కుదర్లేదు.  నచ్చినట్టు బతకాలనుకునే నలుగురు స్నేహితులు లైఫ్‌లో ఎలాంటి సమస్యలను ఫేస్‌ చేశారు? జీవితంలో ఎలా గెలిచారు? అనేది సినిమా కథ. నా దగ్గర మరో రెండు కథలు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు