ఆగస్టులోనే రానా పెళ్లి

11 Jun, 2020 00:15 IST|Sakshi

హీరో రానా తన ప్రేమికురాలు మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 8న వీరి వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. అయితే కరోనా నేపథ్యంలో నిర్ణయించిన తేదీకి పెళ్లి జరుగుతుందా? లేదా? వాయిదా పడనుందట వంటి మాటలు వినిపిస్తున్నాయి. పెళ్లి తేదీలో ఎలాంటి మార్పు ఉండదని, ముందుగా అనుకున్నట్టు  ఆగస్టు 8న జరుగుతుందని దగ్గుబాటి కుటుంబ సభ్యులు తెలిపారు. హైదరాబాద్‌లోనే ఈ వేడుక జరగనుంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఈ పెళ్లి వేడుకను నిర్వహించేందుకు దగ్గుబాటి, బజాజ్‌ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 6, 7 తేదీల్లో ప్రీ–వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్, 8న పెళ్లి జరగనున్నాయి.

మరిన్ని వార్తలు