ధీరోదాత్తుడు

14 Dec, 2014 00:15 IST|Sakshi
ధీరోదాత్తుడు

కాకతీయ చరిత్రలో ‘నిడవర్ద్యపురం’(నిడదవోలు) యువరాజు చాళుక్య వీరభద్రునిది కీలక భూమిక. ధీరోదాత్తుడే కాక, అద్భుతమైన కళాభిమాని చాళుక్య వీరభద్రుడు. రాణీరుద్రమతో తనది పవిత్రమైన బంధం. అనుష్క ప్రధాన పాత్రధారిణిగా, గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘రుద్రమదేవి’ చిత్రంలో చాళుక్య వీరభద్రునిగా దగ్గుబాటి రానా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా చాళుక్య వీరభద్రునిగా రానా ఫస్ట్‌లుక్‌ను శనివారం మీడియాకు విడుదల చేశారు.
 
 ఈ సందర్భంగా గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘రానా శారీరక భాషకు తగ్గ పాత్ర ఇది. ఇందులో అన్ని రసాలనూ రానా అద్భుతంగా పలికించాడు. ముఖ్యంగా అనుష్క, రానాల మధ్య ప్రణయ సన్నివేశాలు చిత్రానికి హైలైట్. ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, సంగీతం: ఇళయరాజా, కెమేరా: అజయ్ విన్సెంట్, కళ: తోట తరణి, కూర్పు: శ్రీకర ప్రసాద్, పాటలు: సిరివెన్నెల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.రామ్‌గోపాల్, సమర్పణ: రాగిణీ గుణ.