‘దటీజ్‌ మహాలక్ష్మి’ ఫస్ట్ లుక్‌

19 Oct, 2018 10:40 IST|Sakshi

బాలీవుడ్‌ సూపర్‌ హిట్ క్వీన్‌ సినిమాను దక్షిణాది భాషల్లో ఒకేసారి రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ  భాషల్లో ఇటీవల షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వర్షన్‌కు ముందుగా షో ఫేం నీలకంఠను దర్శకుడిగా తీసుకున్నారు. కానీ నీలకంఠ ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవటంతో ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ప్రశాంత్‌ వర్మకు దర్శకత్వం బాధ్యతలు అప్పగించారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌కు దటీజ్‌ మహాలక్ష్మి అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. తాజాగా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. లంగా వోణీలో ఉన్న తమన్నా పారిస్‌లోని ఐఫిల్‌ టవర్‌ ముందు డాన్స్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌సినిమా మీద అంచనాలను పెంచేస్తోంది.

మరిన్ని వార్తలు