క్లైమాక్స్‌ కూడా రెడీ!

1 Jun, 2017 01:08 IST|Sakshi
క్లైమాక్స్‌ కూడా రెడీ!

స్టార్టింగ్‌... ఇంటర్వెల్‌... క్లైమాక్స్‌... ఏ సినిమాకైనా ఈ మూడూ ఇంపార్టెంట్‌. దర్శక–రచయితలు ఎవరికి కథ చెప్పినా... మెయిన్‌గా ఈ మూడూ మిస్‌ కారు. కానీ, తమిళ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ అలా కాదు. ఆయనది సెపరేట్‌ స్కూల్‌. ఏ కథ రాసినా, ఇతర రచయితల దగ్గర కథలు తీసుకున్నా... చిత్రీకరణ ప్రారంభించడానికి ముందు సినిమా క్లైమాక్స్‌ రాసే అలవాటు ఈయనకు లేదు. సగం షూటింగ్‌ పూర్తయ్యాక, అప్పటివరకూ వచ్చిన రషెస్‌ చూసుకుని ఓ ఐడియాకు వచ్చిన తర్వాత క్లైమాక్స్‌ స్క్రిప్ట్‌ వర్క్‌ కంప్లీట్‌ చేస్తారు. ఫర్‌ ద ఫస్ట్‌ టైమ్‌... ఓ సినిమా షూటింగ్‌ మధ్యలో ఉండగానే తర్వాతి సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ను క్లైమాక్స్‌తో సహా కంప్లీట్‌ చేశారు గౌతమ్‌ మీనన్‌.

అదే... తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో, నాలుగు భాషల్లోని నలుగురు హీరోలతో తీయనున్న మల్టీస్టారర్‌ ఫిల్మ్‌. ఓ పెళ్లిలో కలసిన నలుగురు స్నేహితులు, అక్కణ్ణుంచి అడ్వంచరస్‌ ట్రిప్‌కు వెళ్లినప్పుడు ఏం జరిగిందనేది ఈ చిత్రకథట! గౌతమ్‌ మీనన్‌ మాట్లాడుతూ– ‘‘హీరోలు పృథ్వీరాజ్‌ (మలయాళం), నాగచైతన్య (తెలుగు), పునీత్‌ రాజ్‌కుమార్‌ (కన్నడ), హీరోయిన్లు అనుష్క, తమన్నా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. అగ్రిమెంట్‌ పేపర్స్‌ మీద సంతకాలు కూడా చేశారు. శింబు (తమిళం) గ్రీన్‌ సిగ్నల్‌ కోసం వెయిట్‌ చేస్తున్నా. మంజిమా మోహన్, నివేదా థామస్‌లలో ఎవరో ఒకరు సినిమాలో నటించే ఛాన్సుంది. ఫస్ట్‌ టైమ్‌ నేను క్లైమాక్స్‌తో సహా స్క్రిప్ట్‌ వర్క్‌ చేశా’’ అన్నారు.