కరోనా: ఆస్కార్‌ కొత్త నియమాలు

29 Apr, 2020 15:03 IST|Sakshi

కరోనా వైరస్‌ వల్ల ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న విషయం తెలిసిందే.  సినిమా రంగంలో అత్యంత ముఖ్యమైన అవార్డు వేడుక ‘ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవం’. కరోనా మమమ్మారి కారణంగా వచ్చే ఏడాది (2021)లో ప్రదానం చేయబోయే ఆస్కార్‌ ఆవార్డుల నియమాలను తాత్కాలికంగా మార్చినట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించింది. వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి ఇప్పటికే అన్ని థియేటర్లను మూసివేసిన విషయం తెలిసిందే. థియేటర్లను ఓపెన్‌ చేయటంలో అనిశ్చితి నెలకొంది. 

ఈ నేపథ్యంలో ఈ ఏడాది అన్‌లైన్‌లో విడుదల చేసి ప్రదర్శించబడిన చిత్రాలను మాత్రమే ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ చేస్తామని అకాడమి వెల్లడించింది. మాములుగా అయితే లాస్ ఏంజిల్స్‌లోని మోషన్ పిక్చర్ థియేటర్‌లో ఎంపిక చేసిన సినిమాలను పరిశీలన కోసం కనీసం ఏడు రోజులపాటు ప్రదర్శిస్తారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఇటువంటి అనిశ్చితి ఉ‍న్న సమయంలో అకాడమీ సభ్యులకు మద్దతు ఇస్తుందని, వారి సేవలను గుర్తించామని అకాడమీ అధ్యక్షుడు డేవిడ్‌ రూబిన్‌, సీఈఓ డాన్‌ హడ్సన్‌ అన్నారు.థియేటర్లు ప్రారంభించిన తర్వాత ప్రస్తుతం ప్రకటించిన తాత్కాలిక నియమాలు వర్తించవని అకాడమి పేర్కొంది. 93వ ఆస్కార్‌ ఆవార్డుల ప్రదానోత్సం ఫిబ్రవరి 28, 2021లో జరగనుంది.  

మరిన్ని వార్తలు