'ఆమెతో నటించడం వాడికి ఇష్టం లేదు'

10 Nov, 2015 12:08 IST|Sakshi
'ఆమెతో నటించడం వాడికి ఇష్టం లేదు'

ముంబై: షారూఖ్ ఖాన్- కాజోల్ జోడికి సినీ అభిమానులంతా నీరాజనాలు పడుతుంటే ఓ బుడతడికి మాత్రం ఈ జంట నచ్చలేదట. ఈ చిన్నారి ఎవరో కాదు షారూఖ్ ముద్దులకొడుకు అబ్ రామ్. కాజోల్ తో తాను కలిసి నటించడం తన చిన్న కొడుకు ఇష్టపడడం లేదని స్వయంగా షారూఖ్ వెల్లడించాడు. తమ జోడి అతడికి నచ్చలేదని తెలిపాడు. ఐదేళ్ల తర్వాత 'దిల్ వాలే' కోసం షారూఖ్, కాజోల్ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా షారూఖ్ మాట్లాడుతూ..  కొన్ని సీన్లు అబ్ రామ్ కు నచ్చలేదని తెలిపాడు. ముఖ్యంగా కాజోల్ కారణంగా తాను గాయపడే సీన్ అసలు నచ్చలేదని చెప్పాడు. ఈ కారణంగానే కాజోల్ తో తాను నటించడాన్ని ఒప్పుకోవడం లేదని, తమ జోడి రెండేళ్ల తన కొడుక్కి నచ్చలేదని వివరించారు. అబ్ రామ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబోనని చెప్పారు. తన కంటే అబ్ రామస్ ఫేమస్ అయిపోతున్నాడని, అందుకే అతడి ఫొటోలో ట్విటర్ లో పెట్టడడం లేదని సరదాగా అన్నారు.

బాలీవుడ్ లో షారూఖ్- కాజోల్ జోడి మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫెయిర్ గా పేరుగాంచింది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు వియవంతమయ్యాయి. వీరిద్దరూ చివరిసారిగా 2010లో 'మై నేమ్ ఈజ్ ఖాన్' సినిమాలో నటించారు.