మళ్లీ తెరపై మీనాక్షి

28 Apr, 2015 23:44 IST|Sakshi
మళ్లీ తెరపై మీనాక్షి

చిరంజీవితో ‘ఆపద్బాంధవుడు’లో ‘ఔరా అమ్మకు చెల్ల’ అనిపించుకున్న మీనాక్షీ శేషాద్రి గుర్తున్నారు కదా. హిందీ, తెలుగు చిత్రాలలో ఎంతో పేరు తెచ్చుకున్న ఆమె మళ్లీ వెండితెరపై మెరవనున్నారు. 1996లో హిందీ సినిమా ‘ఘాతక్’ తరువాత ఆమె పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. 1990లో ఆమె కథానాయికగా నటించిన ‘ఘాయల్’కు సీక్వెల్ అయిన ‘ఘాయల్ వన్స్ ఎగైన్’ చిత్రంతో మళ్లీ వెండితెరను పలకరించనున్నారీమె.
 
  సన్నీ డియోల్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్‌కు ఆయన తండ్రి ధర్మేంద్ర నిర్మాతగా వ్యవ హరిస్తున్నారు. తన చిరకాల స్నేహితుడు సన్నీ డియోల్ నటించమని కోరడంతో మీనాక్షి ఈ చిత్రానికి మూడు రోజులు కేటాయించారట. ఇప్పటికే సీనియర్ తారలు శ్రీదేవి, జుహీ చావ్లా, మాధురీ దీక్షిత్ వెండితెరపై మెరిసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. మీనాక్షీ శేషాద్రి ఈ సినిమాతోనే తన నటనను ఆపేస్తారా..? లేక కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే!