విశ్వాసం  చూపిస్తారు

22 Feb, 2019 00:56 IST|Sakshi

సంక్రాంతికి తమిళనాడు బాక్సాఫీస్‌ దగ్గర సూపర్‌ హిట్‌ సాధించిన చిత్రం ‘విశ్వాసం’. దర్శకుడు శివ, అజిత్‌ కాంబినేషన్‌లో రూపొందిన నాలుగో చిత్రమిది. ఇంతకుముందు ‘వీరం, వేదాళం, వివేగమ్‌’ చిత్రాలు వచ్చాయి. సత్యజోతి ఫిల్మ్స్‌ పతాకంపై రూపొందిన ‘విశ్వాసం’లో నయనతార హీరోయిన్, జగపతిబాబు విలన్‌గా నటించారు. ఈ సూపర్‌హిట్‌ తమిళ చిత్రాన్ని అదే టైటిల్‌తో తెలుగులోకి అనువదిస్తున్నారు నిర్మాత ఆర్‌. నాగేశ్వరరావు. మార్చి 1న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత నాగేశ్వరరావు మాట్లాడుతూ – ‘‘తమిళంలో అజిత్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్‌ అంటే పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం చాలామంది నిర్మాతలు పోటీ పడ్డా మాకు ఇచ్చిన సత్యజోతి సంస్థకు ధన్యవాదాలు. శివ–అజిత్‌ కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సూపర్‌ హిట్‌ సినిమా ఇది. తెలుగులో కూడా సక్సెస్‌ సాధిస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమ్మాన్, కెమెరా: వెట్రి. 

మరిన్ని వార్తలు