ఎ గ్రూప్‌తో తంటా!

15 Jun, 2017 23:14 IST|Sakshi
ఎ గ్రూప్‌తో తంటా!

నాన్‌వెజ్‌ చూడగానే తాప్సీకి నోరూరిపోతుంది. తింటే లావైపోతానేమోననే భయం లేకుండా హ్యాపీగా లాగించేస్తారు. అంత ఇష్టం. అఫ్‌కోర్స్‌ లోపలికి ఎన్ని కేలరీలు తీసుకుంటే అన్నింటినీ కరిగించేయడానికి కఠినమైన ఎక్సర్‌సైజులు చేస్తారనుకోండి. ఆ సంగతలా ఉంచితే.. ఇప్పుడు తాప్సీ ఇంతకు ముందులా మాంసాహారం తీసుకోలేరు.

దానికి కారణం ఆమె బ్లడ్‌ గ్రూప్‌. ఈ బ్యూటీ బ్లడ్‌ గ్రూప్‌ ‘ఎ’. ఈ గ్రూప్‌ గురించి తాప్సీ మాట్లాడుతూ – ‘‘ఎ’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవాళ్లు నాన్‌వెజ్‌ మితంగా తీసుకోవాలట. అది కూడా చేపలు మాత్రమే తినాలి. ఇప్పట్నుంచీ నాన్‌వెజ్‌ డిష్‌ అంటే నాకు చేపలే. కొంచెం కష్టమే కానీ, ట్రై చేస్తా. అన్నట్లు.. పాపం.. నాలా ‘ఎ’ బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవాళ్లు చాలామందే ఉంటారు కదా’’ అన్నారు తాప్సీ. తినే నోరు ఊరుకోదు అన్నట్లు.. ఇన్నాళ్లూ చికెన్, మటన్‌ అంటూ ఓ పట్టుపట్టిన తాప్సీకి ఇప్పుడు వాటికి దూరంగా ఉండటం కొంచెం కష్టమే కదా!