ఆర్‌ఆర్‌ఆర్‌ : కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేసిన ఫ్యాన్స్‌

24 Nov, 2019 15:33 IST|Sakshi

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ఫై దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం పిరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ నటించగా, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి  ఒలివియా మోరిస్‌ నటిస్తోంది.  ఐరిష్‌ నటి అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌సన్‌ విలన్లుగా కనిస్తారు. జెన్నీఫర్‌ పాత్రలో ఒలీవియా మోరిస్, స్కాట్‌ పాత్రలో రే స్టీవెన్‌సన్, అలిసన్‌ డూడీ లేడీ స్కాట్‌గా నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్, ఆలియా భట్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో నటిన్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 31న రిలీజ్‌ కానుంది.

ఇక, తమ అభిమాన హీరో సినిమాల రీలీజ్‌ టైమ్‌లో ఫ్యాన్స్‌ కౌంట్‌డౌన్‌ పేరుతో హంగామా చేయడం సాధారణం. అయితే ఏ వారం ముందో, లేదా నెల ముందో కౌంట్‌డౌన్‌ మొదలు పెడుతారు. కానీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి 8 నెలల ముందే కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేశారు. 250 డేస్‌ టు గో .. అంటూ సోషల్ మీడియాలో కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసేశారు.ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఇంకా 250 రోజులు వేచి చూడాలంటూ ట్విటర్‌ వేదికగా ప్రచారం మొదలెట్టారు. నేటి నుంచి ఎన్నిరోజులు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకన్లకు సినిమా విడుదల అవుతుందో తెలుపుతూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. 

మరో వైపు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు భారీ హైప్‌ తీసుకురావడంపై దర్శకుడు రాజమౌళి దృష్టి పెట్టాడు. క్యాస్టింగ్ దగ్గరి నుంచే సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడుకునేలా చేశాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో హాలీవుడ్ క్యాస్టింగ్‌ను తీసుకున్న రాజమౌళి.. వారి పేర్లను ప్రకటించడం దేశంలోని అన్ని సినీ ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా