రత్తాలు... నీ నవ్వులే రత్నాలు!

10 Mar, 2019 00:21 IST|Sakshi

తెలుగు సినిమాలకు కాస్త దూరమైనా ‘ఐటమ్‌ సాంగ్స్‌’తో పలకరిస్తూనే ఉంది లక్ష్మీరాయ్‌...రాయ్‌లక్ష్మీ! తాజాగా ‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మీ’ గా పలకరించబోతున్న  రాయ్‌లక్ష్మీ అంతరంగ  తరంగాలు ఇవి...

అలా అయ్యింది ఆలస్యం
జూలీ–2 సినిమాకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల సౌత్‌ఫిలిమ్స్‌ ఎక్కుగా చేయలేదు. ఇదొక కారణమైతే ‘మూస స్క్రిప్ట్‌’లు మరోకారణం. ‘ఏదో నటించాలి కాబట్టి నటించాలి’ అనుకునే మనస్తత్వం కాదు నాది. కొత్తగా చేయాలని ఎప్పటికప్పుడు తపిస్తుంటాను.

హీరో కంటే...
 ఇప్పుడు హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాల హవా నడుస్తోంది. హీరోయిన్‌లందరూ ఇలాంటి సినిమాలే చేయాలనుకుంటున్నారు. ఇది మంచిదేగానీ దానికి ముందస్తుగా సన్నద్ధం కావాలి. ఎక్కువగా కష్టపడాలి. సినిమాను తన భుజస్కంధాలపై  వేసుకుని నడిపించాలి. ‘జూలీ–2’కు ఇలాగే చేశాను. ఒక విధంగా చెప్పాలంటే  ఆ సినిమాలో నాది ‘హీరో’ రోల్‌ కంటే ఎక్కువ!

షాక్‌!
జూలి–2 కోసం చాలా హోంవర్క్‌ చేశాను. షూట్‌ కోసం ప్రతి రెండు నెలలకు బరువు తగ్గడమో, పెరగడమో చేశాను. ఒకసారి 11 కిలోల బరువు తగ్గాను. వెంటనే ఏకంగా 17 కిలోల బరువు పెరిగాను. ఆ తరువాత ఫొటోషూటు కోసం 8కిలోల బరువు తగ్గాను. నేను భోజనప్రియురాలిని. నా  బాడీకి బరువు తగ్గడం, పెరగడం అనేది ఒక షాక్‌లాంటిది. షూటింగ్‌లో కాలికి గాయమైంది. ఈ సమయంలోనే కాస్త డిప్రెషన్‌కు గురయ్యాను. చిన్న చిన్న విషయాలకు కోపం వచ్చేది. పేరెంట్స్, ఫ్రెండ్స్‌ సహకారం వల్ల మళ్లీ మూమూలు స్థితికి రాగలిగాను. 

రిగ్రెట్స్‌
ఇతర కమిట్‌మెంట్స్‌ వల్ల కొన్ని సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. ‘నా వల్ల మీ సినిమా ఆలస్యం కావడం నాకు ఇష్టం లేదు. వేరే హీరోయిన్‌ను చూసుకోండి’ అని చెప్పేదాన్ని. నేను వదులుకున్న సినిమాలు హిట్‌ అయినప్పుడు  మాత్రం 
‘ఈ సినిమా నేను చేసి ఉంటే బాగుండేది కదా’ అనిపించేది.

నా పేరు క్రిష్‌!
చిన్నప్పుడు  ఇంట్లో నా ముద్దుల పేరు క్రిష్‌. మా నాన్న  నన్ను అబ్బాయిలాగే పెంచాడు. జుట్టు పెరగనిచ్చేవాడు కాదు. ఆటలు బాగా  ఆడేదాన్ని. పదిహేను సంవత్సరాల వయసులో నా హైట్‌ చూసి... ‘వయసు కంటే ఎక్కువ హైట్‌ ఉంది. భవిష్యత్‌లో ఈ హైట్‌కి తగ్గ అబ్బాయిని చూడటం కష్టం’ అని ఆలోచించారు మా పేరెంట్స్‌! 

మరిన్ని వార్తలు