రిస్క్ చేస్తానంటున్న హృతిక్

19 Feb, 2014 23:11 IST|Sakshi
రిస్క్ చేస్తానంటున్న హృతిక్

 వెండితెరపై విలన్లను హీరోలు ఇరగదీస్తుంటే, ప్రేక్షకులు థ్రిల్ అయిపోతుంటారు. వీరాధి వీరుడు... శూరాధి శూరుడు అని మెచ్చేసుకుంటుంటారు. కానీ, అన్ని ఫైట్లూ హీరో చెయ్యడు. బాగా రిస్క్ అనిపించినవాటిని డూప్‌తో చేయిస్తారు. కొంతమంది హీరోలు మాత్రం రిస్క్ తీసుకుంటారు. అలాంటివారిలో హృతిక్‌రోషన్ ముందు వరుసలో నిలుస్తారు. రిస్కులే నా నేస్తాలు అన్నట్లుగా ఉంటుంది ఆయన వ్యవహారం. ఇటీవల హృతిక్‌కి బ్రెయిన్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్ల పాటు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచించారట. కానీ, హృతిక్ మాత్రం రిస్కులకు రెడీ అయిపోయారు. ప్రస్తుతం ఆయన ‘బ్యాంగ్ బ్యాంగ్’ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు.
 
  ఈ చిత్రం కోసం పోరాట సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వినూత్నంగా ఉండటంతో పాటు కాస్తంత ప్రమాదకరమైన పోరాటాలు కావడంతో డూప్‌తో చేయిద్దామని యూనిట్ సభ్యులు అన్నారట. కానీ, నకిలీకి నో చెప్పేశారట హృతిక్. ‘స్పైడర్‌మేన్ 2’కి పోరాటాలు సమకూర్చిన ఆండీ ఆర్మ్‌స్ట్రాంగ్ ఆధ్వర్యంలో ఈ ఫైట్స్ చిత్రీకరిస్తున్నారు. హృతిక్ తీసుకుంటున్న రిస్క్ చూసి, యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోతున్నారట.