బెట్టింగ్‌ నేపథ్యంలో...

12 Sep, 2017 03:08 IST|Sakshi
బెట్టింగ్‌ నేపథ్యంలో...

శ్రనిత్‌ రాజ్, కల్యాణి, అనిరుథ్, నేహా, ‘చిత్రం’ శీను ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గేమర్‌’.  బి.జి. వెంచర్స్‌ పతాకంపై రాజేశ్‌ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం సినిమా విశేషాలు పంచుకున్నారు. దర్శక–నిర్మాత రాజేశ్‌ తడకల మాట్లాడుతూ– ‘‘బెట్టింగ్‌ నేపథ్యంలో సాగే థ్రిల్లర్‌ చిత్రమిది. లవ్, హారర్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయి.

సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తాయి. మా బ్యానర్‌లో రూపొందిస్తోన్న  ఏడవ సినిమా ఇది. ప్రతిసారి కొత్తవారితోనే సినిమాలు చేస్తున్నాం. ఈ సినిమాతో శ్రనిత్‌ రాజ్, కల్యాణిలను హీరో, హీరోయిన్‌లుగా పరిచయం చేస్తున్నా. బి.జి. యాక్టింగ్‌ అకాడమీ ద్వారా నటీనటులను ఎంపిక చే శాం’’ అన్నారు. ‘‘గేమర్‌’లో నాది ఛాలెంజింగ్‌ పాత్ర. ఈ సినిమా ట్రెండీగా, అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు శ్రనిత్‌ రాజ్, కల్యాణి, అనిరుధ్, నేహా తదితరులు పాల్గొన్నారు.