ఆమెతో థాయ్‌లాండ్‌ చుట్టొచ్చాడు

14 Nov, 2017 07:30 IST|Sakshi

తమిళసినిమా: యువ నటుడు గౌతమ్‌ కార్తీక్‌ వర్ధమాన నటి వైభవి శాండిల్యతో థాయ్‌లాండ్‌ చుట్టొచ్చాడు. ఇంతకు ముందు హరహర మహాదేవకీ వంటి విజయవంతమైన చిత్ర కాంబినేషన్‌ గౌతమ్‌కార్తీక్, దర్శకుడు సంతోష్‌ పి.జయకుమార్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు’ ఇందులో సర్వర్‌సుందరం, చక్క పోడు పోడు రాజా చిత్రాల ఫేమ్‌ వైభవి శాండిల్య నాయకిగా నటిస్తోంది. మరో నటి చంద్రిక దెయ్యంగానూ, నటి యాషిక ప్రధాన పాత్రలోనూ నటిస్తున్నారు. రాజేంద్రన్, కరుణాకరన్, బాలశేఖరన్, మధుమిత, మీసైమమురుక్కు చిత్రం ఫేమ్‌ షారా  ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

దీనికి సంగీతాన్ని బాలమురళీబాలు, ఛాయాగ్రహణం తరుణ్‌బాలాజీ అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తలుపుతూ ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు చిత్ర షూటింగ్‌ను గత అక్టోబర్‌ నెలలో ప్రారంభించాయని తెలిపారు. ఇటీవలే థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని చెన్నైకి తిరిగొచ్చి ఇక్కడ పాటను చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. తదుపరి మళ్లీ తుది షెడ్యూల్‌ చిత్రీకరణ కోసం త్వరలో థాయ్‌ లాండ్‌ వెళ్లనున్నట్లు వెల్లడించారు. నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2018 ఆరంభంలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు సంతోష్‌ పి.జయకుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు