మహానటుల్లో ఆయన ఉంటారు

3 Feb, 2018 00:23 IST|Sakshi
మదన్‌

‘‘గాయత్రి’ సినిమా తండ్రి, కూతుళ్ల కథ. పూర్తిగా వారి మధ్యన నడుస్తుంది. గాయత్రిగా నిఖిలా విమల్‌  నటించారు. మోహన్‌బాబుగారు ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్ర పేరు గాయత్రీపటేల్‌.. మరొకటి శివాజీ. గాయత్రీపటేల్‌ పాత్ర సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది’’ అని దర్శకుడు మదన్‌ రామిగాని అన్నారు. మోహన్‌బాబు హీరోగా విష్ణు, శ్రియ, నిఖిలా విమల్, అనసూయ భరద్వాజ్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘గాయత్రి’. అరియానా, వివియానా, విద్యా నిర్వాణ సమర్పణలో మోహన్‌బాబు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మదన్‌ చెప్పిన విశేషాలు..

► మన జీవితంలో చాలా విషయాలు కష్టమైనవి, ఇష్టమైనవి ఉంటాయి. రెండూ ముడిపడి ఉండేదే గాయత్రి. ఓ విభిన్నమైన అంశం ఈ సినిమాలో ఉంటుంది. అదేంటన్నది తెరపై చూడాలి.
► ‘గాయత్రి’ సినిమా మోహన్‌బాబుగారికి రీ–లాంచ్‌ లాంటిది. ఆయన మంచి సలహాలు ఇచ్చారు. ఎవరు సలహా చెప్పినా ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తారు. అదే మోహన్‌బాబుగారిలోని గొప్పదనం. కేవలం ఒక్క సిట్టింగ్‌లో సినిమా ఓకే చేసేశారు. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉంది.  
► మోహన్‌బాబుగారు మహానటుడు. అంతటి నటుణ్ణి ఎలా హ్యాండిల్‌ చేయగలనా? అనిపించేది. ఎస్వీ రంగారావు, ఎన్టీఆర్, ఏయన్నార్, శివాజీ గణేశన్‌ గార్లు మహానటులు. ఆ జాబితాలో ఆయనుంటారు. ఆయనకు గొప్ప పాత్రలు రాయాలంతే. విష్ణు పాత్ర ఇద్దరు మోహన్‌బాబుల్లో ఒకరికి యంగర్‌ వెర్షన్‌గా ఉంటుంది.
► ఫ్యామిలీ డ్రామాల్లో కొత్త.. పాత ఉండదు. అన్నిటిలోనూ ఎమోషన్‌ ఉంటుంది. ట్రెండ్‌తో సంబంధం లేకుండా ఎప్పుడు తీసినా పండుతాయి. నేను తక్కువ సినిమాలు చేయడానికి ప్రత్యేక కారణం ఏం లేదు. ఎందుకో అలా కుదిరింది. కొత్త కథలు రాసుకుంటున్నా. ఈ ఏడాదే మరో చిత్రం ఉంటుంది. అది ఎవరితో అన్నది తర్వాత చెబుతా.

మరిన్ని వార్తలు