మాది ఒకప్పుడు పేద కుటుంబం: నటి

7 Apr, 2017 12:33 IST|Sakshi
మాది ఒకప్పుడు పేద కుటుంబం: నటి

లండన్‌: పాత్రల ఎంపిక విషయంలో తానెప్పుడూ జాగ్రత్త పడలేదని ప్రముఖ హాలీవుడ్‌ నటి గెమ్మా ఆర్టర్టన్‌ తెలిపింది. తాను చేసిన ప్రతి పాత్ర ద్వారా నేర్చుకునే అనుభవాన్ని సంపాధించానని చెప్పింది. తను పనిచేసే కుటుంబం నుంచి వచ్చానని, అందుకే అవకాశాలు వస్తే చాలనుకొని ఆ పాత్రలు ఎలా ఉన్నాయో చూడకుండా ఆ పాత్రల్లో తనదైన నటన కనబరుస్తూ తనను తాను వృద్ధి చేసుకుంటూ వెళ్లేదానినని వివరించింది. ఒక ఆర్టిస్టుగా తాను ఎదిగేందుకు సహకరించిన ఆ చిత్రాలన్నింటికి తాను రుణపడి ఉంటానని ఓ మేగిజిన్‌కు చెప్పింది.

‘పనిచేసి బతికే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చాను. మేం అప్పట్లో చాలా పేదవాళ్లం. నటించిన తొలి ఏడు, ఎనిమిది సంవత్సరాల నటన ప్రస్థానంలో చాలా కష్టంతో కూడుకున్న పాత్రలు చేసే దాన్ని. కానీ, వాటిని నేను తప్పకుండా చేయాలి. వాటిని నా అదృష్టంగా భావించి చేశాను. అందుకే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాను’ అని చెప్పుకొచ్చింది. ఈమె జేమ్స్‌బాండ్‌ చిత్రాల్లో బాండ్‌ గర్ల్‌గా కూడా నటించింది.