చరిత్ర మరచిపోయిన లీడర్‌

2 Aug, 2019 00:29 IST|Sakshi
సందీప్‌ మాధవ్‌

‘‘జార్జిరెడ్డి ఈ తరానికి తెలియకపోవచ్చు. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి విద్యార్థికి జార్జ్‌ జీవితం గురించి తెలుసు. అలాంటి టెర్రిఫిక్‌ లీడర్‌ గురించి నేటి తరం తెలుసుకునేలా ‘జార్జిరెడ్డి’ చిత్రం రూపొందించాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘వంగవీటి’ ఫేమ్‌ సందీప్‌ మాధవ్‌ (సాండి) లీడ్‌ రోల్‌లో ‘దళం’ ఫేమ్‌ జీవన్‌ రెడ్డి తెరకెక్కించిన సినిమా ‘జార్జిరెడ్డి’. సిల్లీ మాంక్స్, త్రీ లైన్స్‌ సినిమా పతాకాలపై మైక్‌ మూవీస్‌ అధినేత అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు. ‘చరిత్ర మరచిపోయిన లీడర్‌’ అనే విషయాన్ని పోస్టర్‌లోనే చెప్పారు.

దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సమ సమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జిరెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జిరెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్‌లోనే హత్య చేశారు. ఎందరో విద్యార్థులను కదిలించిన విద్యార్థి నేత జీవితం వెండితెరపై చూపిస్తున్నాం. మా సినిమాని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: సుధాకర్‌ యెక్కంటి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, సహ నిర్మాత: సంజయ్‌ రెడ్డి, అసోసియేట్‌ ప్రొడ్యూసర్లు: దాము రెడ్డి, సుధాకర్‌ యెక్కంటి, నేపథ్య సంగీతం: అర్జిత్‌ దత్తా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గన్‌దరగోళం

గ్లామర్‌ రోల్స్‌కి ఓకే

ఆటకి డేట్‌ ఫిక్స్‌

స్కెచ్‌ కంప్లీట్‌

రొమాంటిక్‌ సీన్స్‌ అంటే కష్టం

బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నా కష్టపడాల్సిందే

దౌడు తీయిస్తా

అషూకు సిగ్గు, శరం లేదు : తమన్నా

కెప్టెన్‌ లేకుండానే నడుస్తోంది!

దగ్గుబాటి మామ.. అక్కినేని అల్లుడు వచ్చేస్తున్నారు

‘జార్జిరెడ్డి’ ఫస్ట్‌ లుక్‌

తమన్నాకు ఏసీ లేకుండా నిద్రపట్టదంటా!

బిగ్‌బాస్‌ హౌస్‌లో పవర్‌ గేమ్‌

ఏం కలెక్షన్లురా బై..!

‘ఆమె హీరోయిన్‌గా పనికి రాదు’

బిగ్‌బాస్‌.. టీఆర్పీ రేటింగ్‌లకు బాస్‌

దంగల్‌ దర్శకుడికి షాక్‌ ఇచ్చిన ఆమిర్‌ ఖాన్‌

‘కౌసల్య కృష్ణమూర్తి’ రిలీజ్‌ ఎప్పుడంటే!

సాహో: శ్రద్ధాకి కూడా భారీగానే!

గిఫ్ట్ సిద్ధం చేస్తున్న సూపర్‌ స్టార్‌!

బిగ్‌బాస్‌ 3: నాగ్‌ రికార్డ్‌!

‘అవును.. మేము విడిపోతున్నాం’

‘షారుక్‌ వల్లే హాలీవుడ్‌ వెళ్లాను’

‘యాత్ర’ దర్శకుడి కొత్త సినిమా!

‘చెంపదెబ్బ కొడితే చాలా ఆనంద‌ప‌డ్డా’

అవును.. ఇది నిజమే : శిల్పాశెట్టి

వాళ్లిద్దరూ విడిపోలేదా..? ఏం జరిగింది?

సింగిల్‌ షాట్‌లో ‘అశ్వద్ధామ’ పోరాటం

'రిటైర్‌మెంట్‌ ఉద్యోగానికి మాత్రమే’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గన్‌దరగోళం

గ్లామర్‌ రోల్స్‌కి ఓకే

ఆటకి డేట్‌ ఫిక్స్‌

స్కెచ్‌ కంప్లీట్‌

చరిత్ర మరచిపోయిన లీడర్‌

రొమాంటిక్‌ సీన్స్‌ అంటే కష్టం