‘జార్జ్ రెడ్డి’ పోస్టర్‌ రిలీజ్‌

5 Nov, 2019 21:27 IST|Sakshi
పోస్టర్‌ రిలీజ్‌ చేస్తున్న బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి

చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న సినిమా జార్జ్‌రెడ్డి. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి.. ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి ఉద్యమ నాయకుడి గురించి ఈ తరం తెలుసుకునేలా రూపొందిస్తున్న సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) .

ఈ చిత్రం పోస్టర్‌ను మంగళవారం నందికొట్కూర్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఆవిష్కరించారు. దసరా సందర్భంగా చిత్ర యూనిట్‌ జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్‌ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. చిత్రానికి కెమెరా: సుధాకర్‌ యెక్కంటి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్, అసోసియేటెడ్‌ ప్రొడ్యూసర్స్‌: దాము రెడ్డి, సుధాకర్‌ యెక్కంటి, సహ నిర్మాత: సంజయ్‌ రెడ్డి. ఈ చిత్రం నవంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని వార్తలు