జార్జ్‌రెడ్డి ట్రైలర్ విడుదల

8 Oct, 2019 12:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న సినిమా జార్జ్‌రెడ్డి. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి.. ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి ఉద్యమ నాయకుడి గురించి ఈ తరం తెలుసుకునేలా రూపొందిస్తున్న సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) . దసరా సందర్భంగా చిత్ర యూనిట్‌ జార్జ్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ చేశారు.

సిల్లీ మాంక్స్, త్రీ లైన్ సినిమా బ్యానర్స్‌తో కలిసి మైక్ మూవీస్ అధినేత అప్పిరెడ్డి నిర్మిస్తుండగా, ‘దళం’ ఫేమ్ జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. వంగవీటి మూవీతో ఆకట్టుకున్న సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి క్యారెక్టర్‌‌లో ఒదిగిపోయాడు. సత్యదేవ్, మనోజ్ నందం, అభయ్ బేతిగంటి ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. చేశారు. ఉస్మానియాలో ఉన్న సమయంలో ఉద్యమాల వైపు ఆకర్షితుడైన జార్జ్ రెడ్డి అభ్యుదయ ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య (పీడీఎస్‌యు)ను స్థాపించారు.

ఇది భారతీయ కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) విద్యార్థి విభాగం అనుబంధ సంస్థ. 25 ఏళ్ల వయసులో, ఉస్మానియా క్యాంపస్‌లో.. 30 మంది మూకుమ్మడిగా కత్తులతో దాడి చేసి జార్జ్ రెడ్డిని హత్య చేసిన విషయంతెలిసిందే. ఇప్పుడు ఆయన జీవితకథ ఆధారంగా సినిమా తెరకెక్కబోతోంది. త్వరలోనే విడుదల తేదీలను ప్రకటించనున్నారు.

మరిన్ని వార్తలు