శ్రీరెడ్డికి అవకాశాలు మాత్రం ఇప్పించలేం..

12 Apr, 2018 20:42 IST|Sakshi
శివాజీ రాజా, తమ్మారెడ్డి భరద్వాజ

సాక్షి, హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నటి శ్రీరెడ్డిపై నిషేధం ఎత్తివేసినా.. అవకాశాలు మాత్రం ఇప్పించ లేదని సభ్యులు తెలిపారు. 'మా' సభ్యులు 900 మందితో శ్రీరెడ్డి నటించే స్వేచ్ఛ, అవకాశం ఆమెకు ఉందని 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా పేర్కొన్నారు. ఇకనుంచి శ్రీరెడ్డి సినిమాలతో పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. ప్రముఖ రచయిత కోనవెంకట్‌, సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్‌పై శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై మా బృందం స్పందించింది. కోన వెంకట్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రైటర్స్ అసోసియేషన్ ఉంది. వాళ్లు చూసుకుంటారు. సురేష్ బాబు చిన్న కుమారుడు హీరో కాదు. నిర్మాత, దర్శకుడు కూడా కాదని ఏం సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఇక్కడున్న వారంతా తెలుగువారేనని, ఇండస్ట్రీలో ఎంతో మంది తెలుగువాళ్లు అవకాశాలు దక్కించుకుని కెరీర్ కొనసాగిస్తున్నారని వివరించారు.

శ్రీరెడ్డి వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ మీడియాతో మాట్లాడుతూ.. అప్పుడున్న సందర్భానికి గాను 'మా' కార్యవర్గం కొంత ఎమోషన్ అయ్యారని అన్నారు. ఆ సమయంలో ఆమెను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అది పద్ధతి కాదు అని శ్రీరెడ్డిని కూడా మనలో ఒకరిగా భావించి ముందుకెళ్లాలని అసోసియేషన్ సభ్యులు కోరారు. దీంతో ఆమెపై బ్యాన్‌ను ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయించాం. ఇలాంటి వివాదాలు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు, కాస్ట్ కౌచింగ్ లేకుండా చూసేందుకు కమిటీ అగైనెస్ట్ సెక్యువల్ హెరాస్‌మెంట్ (క్యాష్)ను ఏర్పాటు చేశాం. ఇందులో ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులతో పాటు బయటి వాళ్లు కూడా ఉండేలా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 

ప్రముఖ రచయిత కోన వెంకట్‌ తనతో అసభ్యంగా చాటింగ్‌ చేసేవారంటూ మెసేజ్‌ల స్క్రీన్‌ షాట్లను శ్రీరెడ్డి ఇటీవల పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కోన వెంకట్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే దర్యాప్తు చేపట్టి అసలైన నిందితులను శిక్షించాలి. లీగల్‌ యాక్షన్‌ తీసుకోవాలి. చీప్‌ పబ్లిసిటీ కోసం సినిమా పరిశ్రమను, సినీ ప్రముఖులను వాడుకుంటున్నందుకు జాలేస్తోంది. తెలుగు నటీనటులకు నేనూ మద్దతిస్తాను. కానీ ఈ ఆరోపణలు మాత్రం సహించలేనంటూ’  కోన వెంకట్ ట్వీట్ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు