షూటింగ్‌లో నటిని ఆవహించిన స్వామి

10 Aug, 2018 10:34 IST|Sakshi
పాండిముని చిత్రంలో ఓ దృశ్యం

తమిళసినిమా: చిత్ర షూటింగ్‌లో నటిని ఆవహించిన స్వామి. ఆశ్చర్యానికి గురైన చిత్ర యూనిట్‌. నటుడు ధనుష్‌ తండ్రి, దర్శకుడు కస్తూరిరాజా దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం పాండిముని. ఇంతకు ముందు ధనుష్‌ నటించిన తుళ్లువదో ఇళమై, కాదల్‌ కొండేన్, యారడీ నీ మోహిని వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన సొంత నిర్మాణ సంస్థ ఆర్‌కే.ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కిస్తున్న చిత్రం పాండిముని. జాకీష్రాప్‌ అఘోరిగా ప్రధాన పాత్రను పోషిస్తున్న ఇందులో కొత్త నటుడు ఆశీప్‌ హీరోగా పరిచయం అవుతున్నారు. ఇందులో మేఘలి, జ్యోతి, వైష్టవి, యాషిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో ప్రధాన పాత్రలో షియాజీ షిండే నటిస్తున్నారు. ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది భయంకరమైన హర్రర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు.

70 ఏళ్ల క్రితం అటవీ ప్రాంతంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం పాండిముని అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ కొత్తగిరిలో నిర్వహిస్తుండగా ఒక ఆశ్చర్య సంఘటన జరిగిందన్నారు. మణకుడిసోలై అ ప్రాంతంలో  కుట్టాంసామి అనే గుడి ఉందన్నారు.ఆ ప్రాంత ప్రజలు ఇష్టదైవంగా కొలుసుకుంటారని చెప్పారు. ఆ ఆలయానికి 700 వందల చరిత్ర ఉందని కొందరు, వెయ్యి సంవత్సరాల చరిత్ర అని చెబుతుంటారన్నారు. ఆ ఆలయానికి పాండవులు వచ్చి వెళ్లినట్టు చెబుతారన్నారు. ఒక గృహలాంటి ఆ గుడి వద్ద తాము పాండిముని చిత్ర షూటింగ్‌ చేసినట్లు చెప్పారు. అయితే ఆ గుడికి స్త్రీలకు అనుమతిలేదు, కాళ్లకు చెప్పులు వేసుకుని రాకూడదన్న ఆచారాలు ఉన్నట్లు ఆ ప్రాంత నివాసులు తెలిపారన్నారు. దీంతో తాము క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వచ్చేశామని చెప్పారు. మరుసటి రోజు ఆ పరిసర ప్రాంతాల్లో ౖౖషూటింగ్‌కు రాగా నటి మేఘలికి స్వామి ఆవిహించి ఆడగడం మొదలెట్టిందన్నారు. దీంతో యూనిట్‌ వర్గాలు దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు.

వెంటనే ఆ ప్రాంత ప్రజలు వచ్చి పరిహార పూజలు నిర్వహించడంతో నటి మేఘలి నుంచి స్వామి వెళ్లిపోయాడని తెలిపారు. అదే మాదిరి మరో ఆశ్చర్యమైన సంఘటన ఏమిటంటే పనకుడిసోలైలోని కుట్టంసామి ఆలయంపై భాగంలో హెలికాప్టర్‌ ఎగరలేదన్నారు. ఆలయం చుట్టూ తిరిగిన హెలీకాప్టర్‌ ఆలయంపై భాగంలో తిరిగకపోవడం నిజంగా ఆశ్చర్యపరిచిన అంశం అన్నారు. ఆ ప్రాంతంలో  ఆశీప్,మేఘలి,జ్యోతి,వైష్ణవి,యాషికలకు సంబంధించిన సన్నివేశాలను, మూడు పాటలను చిత్రీకరించినట్లు తెలిపారు. మొత్తం 25 రోజుల పాటు ఆ ప్రాంతంలో షూటింగ్‌ను నిర్వహించినట్లు చెప్పారు. తదుపరి షెడ్యూల్‌లో జాకీష్రాప్‌ నటిస్తున్న అఘోరి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు దర్శక నిర్మాత కస్తూరిరాజా తెలిపారు. దీనికి ఛాయాగ్రహణం మధుఅంజట్, సంగీతాన్ని శ్రీకాంత్‌ దేవా అందిçస్తున్నారు.

మరిన్ని వార్తలు