ఐదు రోజుల తర్వాత నదిలో శవమై తేలిన నటి

14 Jul, 2020 09:21 IST|Sakshi
మరణించిన నటి నయా రివీరా(ఫైల్‌ ఫోటో)

ఐదు రోజుల నుంచి కనిపించకుండా పోయినా ప్రముఖ హాలీవుడ్ నటి నయా రివీరా మృతదేహాన్ని పెరూలేక్‌లో గుర్తించారు పోలీసులు. ‘గ్లీ’ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రివీరా. ఐదు రోజుల క్రితం కాలిఫోర్నియాలోని పెరూ లేక్‌లో ఓ బోటును అద్దెకు తీసుకుని తన నాలుగేళ్ల కుమారిడితో బోటు షికారుకు వెళ్లింది రివీరా. సాయంత్రం అయినా బోట్‌ తిరిగి రాకపోవడంతో.. బోటు యజమాని పోలీసులకు, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం బోటు కనిపించింది. దానిలో రివీరా కుమారుడు ఒక్కడే పడుకుని ఉన్నాడు. పిల్లాడి పక్కనే ఓ లైఫ్‌ జాకెట్‌, రివీరా పర్స్‌ ఉన్నాయి. ‘నేను, అమ్మ ఈత కొట్టడానికి వెళ్లాం. నేను తిరిగి వచ్చాను. కానీ అమ్మ ఇంకా రాలేదు’ అని పిల్లాడు రివీరా కుటుంబ సభ్యులకు తెలిపాడు. దాంతో నటి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు పోలీసులు. ఈ క్రమంలో ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.(డయానా పోలికలు)

దాదాపు ఐదు రోజుల పాటు లేక్‌ను జల్లెడ పట్టిన పోలీసులు నిన్న సాయంత్రం రివీరా మృతదేహాన్ని గుర్తించారు. ఫాక్స్‌ మ్యూజికల్‌ కామేడి చిత్రం ‘గ్లీ’ ఆరు సీజన్‌లలో రివీరా పాటలు పాడే చీర్‌ లీడర్‌ సంటాన లోపెజ్‌ పాత్రలో నటించింది. అయితే దీనిలో నటించి.. ముప్సై ఏళ్లలోపు మరణించిన వారిలో రివీరా మూడో వ్యక్తిం. ఏడేళ్ల క్రితం సరిగ్గా ఇదే సమయంలో రివీరా సహనటుడు కోరి మాంటెయిత్‌ 31 ఏళ్ల వయసులోనే చనిపోయాడు. మద్యం, హెరాయిన్‌ కలిపి తీసుకోవడం వల్ల అతడు మరణించినట్లు​ పోలీసులు తెలిపారు. గ్లీ చిత్రంలో తనతో పాటు నటించిన మార్క్‌ సాలింగ్‌తో రివీరా కొద్ది రోజులు డేటింగ్‌ చేసింది. అయితే అతడిపై చైల్డ్‌ పోర్నోగ్రఫి ఆరోపణలు రుజువు కావడంతో.. 2018లో తన 35 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు