14న తెరపైకి గోలీసోడా–2

9 Jun, 2018 08:06 IST|Sakshi
గోలీసోడా–2 చిత్రంలో భరత్‌ సీనీతో సుభిక్ష

తమిళసినిమా: పక్కింటి అమ్మాయి లాంటి భావన, స్పష్టమైన తమిళ భాష ఉచ్చరింపు. అందమైన రూపం వెరసి నటి సుభిక్ష. ఇలాంటి సహజమైన గుణాలతో తమిళ ప్రేక్షకులను ఆకట్టకుంటున్న ఈ భామ కడుగు చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఈ చిత్రంలో నటించింది తక్కువ సన్నివేశాల్లోనే అయినా తనదైన ముద్రవేసుకుంది. అందుకే ఆ చిత్ర దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ తన తాజా చిత్రం గోలీసోడా–2లో ఏకంగా హీరోయిన్‌ని చేసేశారు. భరత్‌ సీనీ హీరోగా నటించి నిర్మించిన ఈ చిత్రం 14న తెరపైకి రానుంది. ఈ ఆనందంలో గోలీసోడా–2 చిత్రంలో నటించిన అనుభవాలను సుభిక్ష చెబుతూ కడుగు చిత్రంలో చిన్న పాత్ర అయినా తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందని చెప్పింది. ఆ చిత్రం విడుదల తరువాత ప్రేక్షకులు తనను కడుగు సుభిక్ష అని పిలుస్తుండడం సంతోషంగా ఉందని అంది. మళ్లీ విజయ్‌మిల్టన్‌ దర్శకత్వంలో నటించే అవకాశం లభిస్తే బాగుండు అనుకుంటుండగా ఈ గోలీసోడా–2 చిత్రంలో నటించే అవకాశం తన ఇంటి తలుపు తట్టిందని ఊహించలేదని చెప్పింది.

ఇందులో భరత్‌ సీనీకి జంటగా నటించానని చెప్పింది. ఇందులో తన పాత్ర పేరు ఇన్భవల్లి అని తెలిపింది. పక్కింటి అమ్మాయి లాంటి జాలీగా సాగే పాత్ర అని చెప్పింది. ఈ చిత్ర కథ, తన పాత్ర గురించి దర్శకుడు విజయ్‌మిల్టన్‌ చెప్పినప్పుడు సహజంగా నటిస్తే చాలని, ప్రత్యేకంగా ఎలాంటి ప్రిపేర్‌ అవ్వాల్సిన అవసరం లేదని అన్నారంది. కడుగు చిత్రంలో తనకు భరత్‌ సీనీకి చాలా తక్కువ సన్నివేశాలే చోటు చేసుకున్నాయన్న విషయాన్ని దర్శకుడి వద్ద ప్రస్తావించగా తన తన మాటల్ని సరిగా అర్థం చేసుకున్న ఆయన గోలీసోడా–2 చిత్రంలో చాలా బలమైన పాత్రను ఇచ్చారని చెప్పింది. ఇందులో భరత్‌ సీనీ యాక్షన్‌ సన్నివేశాల్లో కంటే ప్రేమ సన్నివేశాల్లోనే బాగా నటించారని తెలిపింది. గోలీసోడా చిత్రంలో తమిళ చిత్ర పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకున్న దర్శకుడు విజయ్‌ మిల్టన్‌ దానికి సీక్వెల్‌గా తెరకెక్కించిన గోలీసోడా–2 చిత్రాన్ని రఫ్‌నోట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై భరత్‌ సీనీ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 14న తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా