శేష్‌కు ఆ లోటు ఈ సినిమాతో తీరిపోతుంది

28 Jul, 2018 04:22 IST|Sakshi
శశికిరణ్‌ తిక్క, అడవి శేష్, శోభిత, నాని

నాని

‘‘లాస్ట్‌ టైమ్‌ నేను ‘అర్జున్‌ రెడ్డి’ ట్రైలర్‌ రిలీజ్‌ చేశాను. అది సూపర్‌ హిట్‌. శేష్‌ అద్భుతమైన నటుడు. ఎందుకో తనకు రావాల్సినంత గుర్తింపు రావడం లేదని ఫీల్‌ అయ్యేవాణ్ని. కానీ ఆ లోటు ‘గూ«ఢచారి’ సినిమా తీరుస్తుంది. ఇది శేష్‌కి  కరెక్ట్‌ సినిమా’’ అని హీరో నాని అన్నారు.  ‘క్షణం’ తర్వాత హీరో అడవి శేష్‌ కథను అందించి, నటించిన చిత్రం ‘గూఢచారి’. శశికిరణ్‌ తిక్క దర్శకత్వంలో అభిషేక్‌ నామా, టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మించారు. శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటించారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ద్వారా ఆగస్ట్‌ 3న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర రిలీజ్‌ చేయనున్నారు. శుక్రవారం ఈ చిత్రం టీజర్‌ను హీరో నాని రిలీజ్‌ చేసి, మాట్లాడుతూ – ‘‘శేష్‌ ఏ సినిమా గురించి అయినా సోషల్‌ మీడియాలో చాలా పాజిటివ్‌గా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తికి నేను సపోర్ట్‌గా ఉండాలని ఈ ఫంక్షన్‌కు వచ్చాను. ట్రైలర్‌ అదిరిపోయింది. ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, రీ రికార్డింగ్, పెర్ఫార్మెన్స్‌ అన్నీ అద్భుతంగా ఉన్నాయి.  ట్రైలరే ఈ రేంజ్‌లో ఉంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో? ప్రేక్షకులు ఈ సినిమాను బ్లాక్‌ బస్టర్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌లో మా సినిమా కంటెంట్‌ ఏంటి అనేది చూపిస్తున్నాం. సాధారణ కాలేజ్‌ స్టూడెంట్‌ గూఢచారిలా మారితే ఎలా ఉంటుంది? అనేది మా చిత్రం కాన్సెప్ట్‌. చాలా నెర్వస్‌గా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి మా టీమ్‌ ముఖ్య కారణం. అందరం రాత్రీ పగలు కష్టపడ్డాం. ట్రైలర్‌ రిలీజ్‌ చేసినందుకు నానికి స్పెషల్‌ థ్యాంక్స్‌’’ అన్నారు అడవి శేష్‌. ‘‘ టీమ్‌ అంతా కమిట్‌మెంట్‌తో వర్క్‌ చేశారు. ఇలాంటి చిత్రాన్ని మా బ్యానర్‌ ద్వారా రిలీజ్‌ చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు అనిల్‌ సుంకర.  ఈ చిత్రానికి సంగీతం : శ్రీచరణ్‌ పాకల, మాటలు: అబ్బూరి రవి, కెమెరా : షానీ డియోల్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు