116 రోజుల్లో 158 లొకేషన్లలో..!

24 Jul, 2018 10:25 IST|Sakshi

క్షణం, అమీ తుమీ సినిమాలతో ఆకట్టుకున్న అడివి శేష్ ఓ స్పై థ్రిల్లర్ మూవీ గూఢచారితో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తెలుగు తెర మీద అరుదుగా కనిపించే బాండ్‌ తరహా కథా కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌లకు మంచి రెస్పాన్స్‌ రావటంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు 3న ప్రపంచవ్యాప్తంగా భారీగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌.

తాజాగా సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ను వెల్లడించారు చిత్రయూనిట్‌. ఈ సినిమాను 116 రోజుల్లో దాదాపు 158 డిఫరెంట్‌ లోకేషన్లలో హై టెక్నికల్‌ వ్యాల్యూస్‌తో చిత్రీకరించినట్టుగా వెల్లడించారు. అడివి శేస్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో 2013 మిస్ ఇండియా శోభిత ధూళిపాళ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.. ఒకప్పటి హీరోయిన్ సుప్రియ యార్లగడ్డ 20 సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుండటం మరో విశేషం. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు విస్టా డ్రీమ్ మర్చంట్స్ సయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను అనిల్‌ సుంకరకు చెందిన ఏకే ఎంటర్ టైన్మెంట్స్  అసోసియేషన్ తో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు