గోపాల గోపాలకు 'యు' సర్టిఫికెట్

9 Jan, 2015 03:53 IST|Sakshi
గోపాల గోపాలకు 'యు' సర్టిఫికెట్

పవన్ కల్యాణ్, వెంకటేశ్ కలిసి నటిస్తున్న గోపాల గోపాల సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ వచ్చినట్లు తెలిసింది. శ్రేయస్ మీడియా ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా వెల్లడించింది. గురువారమే సెన్సార్ బోర్డు ముందుకు వచ్చిన ఈ సినిమా... ఎలాంటి అడ్డంకులు, అభ్యంతరాలు లేకుండా యు సర్టిఫికెట్ పొందిందని శ్రేయస్ మీడియా చెప్పింది. దాంతో ఈ సినిమా శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

దాంతో సినిమా విడుదలకు కూడా ఎలాంటి ఆటంకాలు లేనట్లయింది. ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలవడానికి కూడా ఈ సినిమా సిద్ధం అయిపోతోంది. ఎప్పుడు విడుదల చేసేదీ మాత్రం ఇంకా చిత్ర నిర్మాతలు వెల్లడించలేదు. అయితే.. బుక్ మై షో లాంటి సైట్లు మాత్రం పదోతేదీ శనివారం నాడు సినిమా విడుదల అవుతోందని చెబుతూ, ఇప్పటికే టికెట్ల అమ్మకం కూడా మొదలుపెట్టేశాయి.