గాయనితో 9 ఏళ్లుగా గోపీ సుందర్‌ సహజీవనం

15 May, 2020 11:27 IST|Sakshi

దక్షిణాదిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు గోపీ సుందర్‌. తన దైన శైలీలో బాణీలను అందిస్తూ సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాడు. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’తో టాలీవుడ్‌లో మ్యూజిక్‌ కంపోజర్‌గా అరంగేట్రం చేసిన గోపీ ‘గీతా గోవిందం’ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా మారి మిగతా సంగీత దర్శకులకు తీవ్రమైన పోటీని ఇస్తున్నాడు. అయితే ఇప్పటివరకు గోపీ సుందర్‌ వృత్తిపరమైన జీవితం గురించే అందరికీ తెలుసు. కానీ తాజాగా ఆయన ఇన్‌స్టాలో షేర్‌ చేసిని పోస్ట్‌తో అతడి వ్యక్తిగత జీవితం తెలసుకోవడానికి నెటిజన్లు తెగ ఆసక్తిచూపిస్తున్నారు.
   
2001లో గోపీసుందర్‌కు ప్రియ అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే మనస్పర్థలు తలెత్తడంతో గోపీసుందర్‌ తన భార్య నుంచి విడాకులు కావాలిన కోర్టును ఆశ్రయించాడు. అయితే విడాకులు ఇచ్చేందుకు ఆయన భార్య ప్రియ కూడా సమ్మతంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే యువ గాయని అభయ హిరణ్మయితో గోపీ సుందర్‌ ప్రేమలో పడ్డాడు. గోపీ- హిరణ్మయిలు తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని వేర్వేరు సందర్భాల్లో వీరిద్దరూ అధికారికంగా తెలిపారు. ‘నా ఉనికికి నువ్వే కారణం’ అంటూ హిరన్మయితో కలిసి దిగన ఫోటోను తన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు గోపీ సుందర్‌. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.ఇక గోపీ సుందర్‌ స్వరపరిచిన అనేక పాటలను హిరణ్మయి ఆలపించిన విషయం తెలిసిందే. చదవండి:
అప్పుడు దిమాక్‌ ఖరాబ్‌.. ఇప్పుడు డింఛక్‌
పవర్‌ ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కౌశల్‌

You are the reason I exist ❤️

A post shared by Gopi Sundar Official (@gopisundar__official) on

మరిన్ని వార్తలు