గోపీచంద్‌ మూవీకి మోక్షం.. ఓటీటీలో రిలీజ్‌?

20 Jun, 2020 12:13 IST|Sakshi

మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలతో పాటు సినీ రంగాన్ని కూడా కుదిపేసింది. చాలా విరామం తర్వాత ఇప్పుడిప్పుడే షూటింగ్స్‌ మొదలవుతున్నాయి. అయితే థియేటర్లు తెరుచుకునే విషయంలో ఇప్పటికీ సందిగ్దత కొనసాగుతూనే ఉంది. దీంతో విడుదలకు సిద్దంగా ఉన్న చిత్రాలను ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌ మీడియా సర్వీసెస్‌)లో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా విడుదల అయ్యాయి. అమృతరామమ్‌తో పాటు కీర్తి సురేష్‌, జ్యోతిక, అమితాబ్‌ల చిత్రాలు ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక షూటింగ్‌ పూర్తి చేసుకొని పలు కారణాలతో విడుదలకు నోచుకోని చిత్రాలు సైతం ఓటీటీలో విడుదల కాబోతున్నాయి. (ఆగస్ట్‌లో కబడ్డీ కబడ్డీ)

తాజాగా గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ చిత్రం కూడా డిజిటల్‌ బాట పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మూడేళ్ల క్రితం గోపీచంద్‌, నయనతార జంటగా మాస్‌ డైరెక్టర్‌ బి. గోపాల్ తెరకెక్కించిన సినిమా 'ఆరడుగుల బుల్లెట్'. షూటింగ్ పూర్తయినా.. చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాత ప్రయత్నాలు మొదలు పెట్టారంటా. గోపిచంద్‌ క్రేజ్‌, నయనతరా గ్లామర్‌‌, గోపాల్‌ ఇమేజ్‌ కలగలపి ఈ చిత్రానికి ఓటీటీలో మంచి డిమాండ్‌ ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఓటీటీ నిర్వాహకులతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే గుడ్ న్యూస్ రానుందని  ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఓటీటీలో విడుదల అవుతున్న గోపీచంద్-నయనతార చిత్రం ఎలా వుంటుందో చూడాలనే ఆసక్తి అందరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. (ఐ వాన్న అన్‌ఫాలో యు)

మరిన్ని వార్తలు