గోపీచంద్‌ సీటీమార్‌

22 Jan, 2020 04:02 IST|Sakshi

గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘సీటీమార్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రంలో కథానాయికలుగా తమన్నా, దిగంగనా సూర్యవంశీ నటిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా నిరి్మస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ రాజమండ్రిలో జరుగుతోందని తెలిసింది. కబడ్డీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఆంధ్ర మహిళల జట్టు కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ మహిళల జట్టు కోచ్‌గా తమన్నా నటిస్తున్నారని సమాచారం. రాజమండ్రి షెడ్యూల్‌ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను చిత్రబృందం ఢిల్లీలో ప్లాన్‌ చేసిందట. ఈ సినిమాను ఈ వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా