రాహుల్‌ పెద్ద హీరో కావాలి : గోపిచంద్‌

2 Mar, 2020 16:50 IST|Sakshi

తమని యాక్షన్‌ హీరోలుగా మలచిన విజయ్‌ మాస్టర్‌ కుమారుడు రాహుల్‌ పెద్ద హీరో కావాలని హరో గోపిచంద్‌ ఆకాంక్షించారు. ఫైట్‌ మాస్టర్‌ విజయ్‌ కుమారుడు రాహుల్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాలేజ్‌ కుమార్‌’.  కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రంతో హరి సంతోష్‌ తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో రాహుల్‌ విజయ్‌ సరసన ప్రియా వడ్లమాని హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్‌, మధుబాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 6న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హీరో గోపిచంద్‌, దర్శకుడు గోపిచంద్‌ మలినేని, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ‘ఈ కథ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగుంది. రాహుల్, రాజేంద్రప్రసాద్ గారి కెమిస్ట్రీ బాగుంటుందని ట్రైలర్ చూస్తే తెలిసింది. రాజేంద్రప్రసాద్ గారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకు వయసు పెరుగుతుందో, తగ్గుతుందో తెలియడం లేదు. ఆయన ఎనర్జీ చూస్తే అలా అనిపిస్తుంది. ఆయన ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేయడం సినిమా బాగా వచ్చిందనే నమ్మకాన్ని పెంచింది. దర్శకుడికి ఈ సినిమా తెలుగులో మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.  ముఖ్యంగా ఈ ఈవెంట్ కి రావడానికి కారణం విజయ్ మాస్టర్. ఆయన  మాట నేనెప్పుడూ కాదనను. మాలాంటి హీరోలకు యాక్షన్ ఇమేజ్ వచ్చిందంటే కారణం విజయ్ మాస్టర్, రామలక్ష్మణ్ మాస్టర్ల కృషే కారణం. అలాంటి మాస్టర్ ఇంట్లో నుంచి వస్తున్న అబ్బాయి రాహుల్. మమ్మల్ని హీరోలను చేసిన మాస్టర్ కొడుకు పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్’  అన్నారు. 

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం అని ఈ ఈవెంట్ మరోసారి ప్రూవ్ చేసింది. స్టార్టింగ్ డేస్ తమకు విజయ్ మాస్టర్ ఎలా సాయం చేసాడో రామ్ లక్ష్మణ్ లు చెప్పారు. గోపీచంద్ తనకు యాక్షన్ ఇమేజ్ తెచ్చిన విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ హీరో గా నిలబడాలని అతని కోసం ఇక్కడికి వచ్చాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఆర్టిస్ట్ అయినా నటిస్తున్నంత కాలం చాలా సంతోషంగా ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు నేను మీకు వినోదాన్ని అందిస్తున్నానంటే అది నా పూర్వ జన్మ సుకృతం. జనవరిలో నేను నటించిన  ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సెంకండాఫ్లో నవ్వలేక మీ పొట్టలు చక్కలవుతాయి. అలాగే దర్శకుడు హరి చాలా టాలెంటెడ్. అతను తనకున్న వనరులతోనే అద్బుతమైన కంటెంట్ని తీసుకురాగలడు. అతని కోసం ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.  గోపీచంద్ మనకున్న మంచి హీరోలలో ఒకరు. అతను ఈ ఈవెంట్లో భాగం అవడం సంతోషంగా ఉంది. ఒక తండ్రిని కోడుకు ఎందుకు చదవించాడు.. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గమ్మత్తుగా ఉంటుంది. ఈ పాయింట్‌నే ఆసక్తిగా తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు. విషయం సీరియస్‌గా ఉన్న చెప్పే విధానం హాయిగా ఉంటుంది. అదే ఈ సినిమాను ప్రేక్షకులను దగ్గర చేస్తుంది’ అన్నారు. 

రాహుల్ మాట్లాడుతూ.. ‘చ‌ద‌వ‌డం గొప్పా.. చ‌దివించ‌డం గొప్పా అనే లైన్‌తో ఫాద‌ర్ అండ్ స‌న్ మ‌ద్య  వ‌చ్చే కాన్‌ప్లిక్ట్ని ద‌ర్శ‌కుడు బాగా హ్యాండిల్ చేసారు. ఈ సినిమా నా కెరియ‌ర్లో గుర్తుండిపోతుంది. త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ నచ్చుతుంది అని న‌మ్ముతున్నాను. రాజేంద్ర ప్రాస‌ద్ గారితో క‌ల‌సి ప‌నిచేయ‌డం నన్ను బెట‌ర్ ఆర్టిస్ట్ని చేసింది. ఈసినిమా మీకున‌చ్చితే అందులో ఎక్కువ క్రెడిట్ రాంజేంద్ర ప్రసాద్‌ గారికే చెందుతుంద’ని చెప్పారు.

మధుబాల మాట్లాడుతూ.. ఈ కథ అందరికీ కనెక్ట్‌ అవుతుందన్నారు. ప్రతి ఇంట్లో ఈ పరిస్థితి ఎదురవుతుందని.. దానిని దర్శకుడు హరి అందంగా తెరమీదకు తెచ్చారని తెలిపారు. ఇలాంటి కథలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ద‌ర్శ‌కుడు మ‌లినేని గోపీచంద్ మాట్లాడుతూ..‘స్క్రీన్‌  మీద రాజేంద్ర ప్ర‌సాద్ గారి టైమింగ్ ని ప‌ట్టుకోవ‌డం తేలికైన విష‌యం కాదు. రాహుల్ ఈ సినిమాలో బెట‌ర్ ఆర్టిస్ట్ గా క‌నిపిస్తాడు అని న‌మ్ముతున్నాను. ఈ చిత్రంలో ప్ర‌తి ఇంట్లో తండ్రికొడుకుల మ‌ద్య ఉండే క‌థ‌ను ప‌ట్టుకోని చాలా బ్యూటిఫుల్‌గా చెప్పారు. కొడుక్కి కోపం వ‌చ్చి తండ్రిని  చ‌దువుకోవ‌డానికి పంపుతున్నాడు అది నాకు బాగాన‌చ్చింది. ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను’ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు హరి మాట్లాడుతూ.. ‘మంచి సినిమాను తెలుగు, త‌మిళ్‌లో చేయ‌డానికి న‌న్ను ఎంచుకున్నందుకు నిర్మాత‌కు థ్యాంక్స్. మంచి క‌థ  ఉంటే  ఏ లాంగ్వేజ్ లో అయినా క‌థ చెప్ప‌వ‌చ్చు అని న‌మ్ముతాను. ఒక సెట్ అసిస్టెంట్ కొడుకుగా జ‌ర్నీ మొద‌లు పెట్టి ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చాను. ఈ ప్ర‌యాణం లో నాకు స‌పోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్. ఈ క‌థకు లాంగ్వేజ్ బారియ‌ర్స్ ఉండ‌వు. ఒక యూనివ‌ర్స‌ల్ పాయింట్ క‌నిపిస్తుంది. మీ ఆశీస్సులు కావాలి’ అన్నారు. హీరోయిన్ ప్రియ వ‌డ్ల‌మాని మాట్లాడుతూ.. ‘ ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ ఎమోష‌న్స్ ని రియ‌లిస్టిక్‌గా క‌నిపిస్తాయి. మా పాట‌లు.. ట్రైల‌ర్ న‌చ్చితే సినిమా కి రండి. మా సినిమాలో ట్విస్ట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆర్టిస్ట్ గా నాకు ఈ సినిమాలో ప‌నిచేయ‌డం ఎప్ప‌టికీ గుర్తిండిపోతుంది. రాజేంద్ర ప్ర‌సాద్ గారి కాంబినేష‌నల్ సీన్స్ మీకు బాగా న‌చ్చుతాయి. రాహుల్ బెస్ట్ కో ఆర్టిస్ట్’  అని అన్నారు. 

ఫైట్‌ మాస్టర్‌ రామ్ మాట్లాడ‌తూ.. ‘రాహుల్‌కి నేను చెప్పేది ఒక్క‌టే నువ్వు నీ ప‌ని ని న‌మ్ముకో. అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అదే నిన్ను నిల‌బడెతుంది. ఆ నమ్మకమే మ‌మ్మ‌ల్ని ఇంత వ‌ర‌కూ తెచ్చింది. ఫైట్‌ మాస్టర్‌ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇందులో రాహుల్‌ నటన బాగా నచ్చిందన్నారు. రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా అని చెప్పారు.

మరిన్ని వార్తలు