సింగిల్‌ టేక్‌లో...l

25 Feb, 2017 01:18 IST|Sakshi
సింగిల్‌ టేక్‌లో...l

లైట్‌గా వెయిట్‌ తగ్గింది.. మజిల్‌ పెరిగింది. లైట్‌గా హెయిర్‌ కట్‌ చేశాడు... రఫ్‌గా కాస్త గడ్డం పెంచాడు. కట్‌ చేస్తే.. న్యూ హ్యాండ్సమ్‌ లుక్‌తో గోపీచంద్‌ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు. ఆయన హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో జె. భగవాన్, జె. పుల్లారావ్‌ నిర్మిస్తున్న సినిమా ‘గౌతమ్‌నంద’. మహాశివరాత్రి సందర్భంగా గోపీచంద్‌ సెకండ్‌ లుక్‌ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్‌ లుక్‌కి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

సంపత్‌ నంది ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని హీరో క్యారెక్టర్‌ని సై్టలిష్‌గా ఎలివేట్‌ చేశారు. ప్రస్తుతం రామ్‌–లక్ష్మణ్‌ నేతృత్వంలో యాక్షన్‌ సీన్స్‌ తీస్తున్నాం. మూడు నిమిషాల ఓ ఫైట్‌ కోసం గోపీచంద్‌ నాలుగు రోజులు రిహార్సల్స్‌ చేయడంతో సింగిల్‌ టేక్‌లో పూర్తి చేశాం. తెలుగులో ఈ విధంగా చేయడం ఇది మొదటిసారి. ఈ షెడ్యూల్‌తో టాకీ పూర్తవుతుంది. మార్చిలో పాటల చిత్రీకరణకు విదేశాలు వెళతాం’’ అన్నారు. హన్సిక, కేథరిన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కళ: బ్రహ్మ కడలి, కూర్పు: గౌతంరాజు, కెమేరా: ఎస్‌. సౌందర్‌రాజన్, సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌.