మీ ప్రేమను తిరిగి ఇచ్చేస్తా

1 Oct, 2019 01:38 IST|Sakshi
రామజోగయ్య శాస్త్రి, అబ్బూరి రవి, తిరు, గోపీచంద్, రాజే ష్‌ కతార్, ఎంవీవీ సత్యనారాయణ

‘‘నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలను కోరుకుంటారో అవన్నీ ‘చాణక్య’ సినిమాలో ఉన్నాయి. ఓ హీరోను ఎలా చూపించాలో తిరుగారు అలా చూపించారు’’ అని హీరో గోపీచంద్‌ అన్నారు. తిరు దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్‌ జంటగా, బాలీవుడ్‌ హీరోయిన్‌ జరీన్‌ఖాన్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘చాణక్య’. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర  నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. వైజాగ్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో గోపీచంద్‌ మాట్లాడుతూ– ‘‘అనిల్‌ సుంకరగారికి సినిమాలంటే ఎంతో ప్యాషన్‌.. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. అబ్బూరి రవిగారు చాలా మంచి డైలాగ్స్‌ రాశారు. విశాల్‌ చంద్రశేఖర్, శ్రీచరణ్‌ పాకాల అద్భుతమైన సంగీతం అందించారు. మీ ప్రేమను ఈనెల 5న తిరిగి ఇచ్చేస్తా’’ అన్నారు. ‘‘చాణక్య’ సినిమా  పెద్ద సక్సెస్‌ సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు ఎంపీ, నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ. డైరెక్టర్‌ తిరు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్‌గారు సరికొత్త పాత్రలో, చాలా కష్టపడి చేసిన చిత్రమిది. ఆయన ఇష్టమైన సినిమాల లిస్టులో మా సినిమా కూడా ఉంటుంది’’ అన్నారు. ‘‘గోపీచంద్‌గారిని సరికొత్త కోణంలో చూపిస్తున్నాం’’ అన్నారు నిర్మాత అనిల్‌ సుంకర. నటుడు రాజేష్‌ కతార్‌. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్, మాటల రచయిత అబ్బూరి రవి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గిరికిపాటి, సహ నిర్మాత: అజయ్‌ సుంకర, కెమెరా: వెట్రి పళనిస్వామి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా