ఫారిన్‌లో ఆటా పాట

26 May, 2018 05:53 IST|Sakshi

గోపీచంద్‌ ‘పంతం’ ఎంతవరకూ వచ్చిందంటే.. ప్రస్తుతానికి లండన్‌ వెళ్లింది. కన్‌ఫ్యూజ్‌ అవ్వకండి.. ఆయన నటిస్తున్న ‘పంతం’ సినిమా గురించి చెబుతున్నాం. కె. చక్రవర్తి దర్శకత్వంలో గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్‌ నిర్మిస్తున్న సినిమా ‘పంతం’. ‘ఫర్‌ ఏ కాజ్‌’ అనేది ఉప శీర్షిక. ఇందులో మెహరీన్‌ కథానాయిక.

ప్రస్తుతం పాటల కోసం ఫారిన్‌ వెళ్లారు టీమ్‌. అక్కడ రెండు పాటలను చిత్రీకరిస్తారు. ఆల్రెడీ రిలీజ్‌ చేసిన గోపీచంద్‌ లుక్‌కు మంచి స్పందన లభించింది. ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్స్‌ కూడా ఊపందుకున్నాయి. డబ్బింగ్‌ వర్క్‌ స్టార్ట్‌ చేశారు. యాక్షన్‌తో పాటు, మంచి హాస్య సన్నివేశాలతో ఆడియన్స్‌ను మెప్పించేలా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయనున్నారు. పృథ్వీ, జయ ప్రకాశ్‌రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: గోపీసుందర్‌.

మరిన్ని వార్తలు