బ్యాక్‌ టు యాక్షన్‌

5 Apr, 2019 03:55 IST|Sakshi
గోపీచంద్‌, దర్శకుడు తిరు

....అని అంటున్నారు హీరో గోపీచంద్‌. తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న సినిమాలో గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను రాజస్తాన్‌లో మొదలుపెట్టారు. అయితే... ఓ యాక్షన్‌ సీన్‌లో భాగంగా గోపీచంద్‌ గాయపడటంతో ఈ షెడ్యూల్‌ ఆగిపోయిన విషయం తెలిసిందే.

కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న గోపీచంద్‌ కోలుకున్నారు. పూర్తి ఆరోగ్యంతో సెట్‌లో జాయిన్‌ అవ్వడానికి రెడీ అయ్యారు. ‘‘నెక్ట్స్‌ షెడ్యూల్‌ కోసం రెడీ అవుతున్నాం’’ అంటూ ఇక్కడున్న ఫొటోను షేర్‌ చేశారు దర్శకుడు తిరు. ఈ సినిమాలో ఓ బాలీవుడ్‌ భామను హీరోయిన్‌గా అనుకుంటున్నట్లు తెలిసింది. ఇక ఈ సినిమా కాకుండా బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా