ఆట ఆరంభం

15 Dec, 2019 00:35 IST|Sakshi
సంపత్‌ నంది, గోపీచంద్, తమన్నా, శ్రీనివాస చిట్టూరి

గోపీచంద్‌ హీరోగా సంపత్‌ నంది దర్శకత్వంలో పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో తమన్నా కథానాయికగా నటిస్తున్నారు. భూమిక, రావు రమేష్, దిగంగన సూర్యవంశి కీలక పాత్రధారులు. కబడ్డీ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. అంటే ఆరంభమైందన్నమాట.

ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ–‘‘హైదరాబాద్‌లో మొదలైన తొలి షెడ్యూల్‌లో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను ప్లాన్‌ చేశాం. ఆ నెక్ట్స్‌ రాజమండ్రి, ఢిల్లీల్లో షూటింగ్‌ జరుగుతుంది. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు