ఆగస్ట్‌లో కబడ్డీ కబడ్డీ

12 Jun, 2020 06:00 IST|Sakshi

‘గౌతమ్‌నంద’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో గోపీచంద్‌ – డైరెక్టర్‌ సంపత్‌ నంది కలయికలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీటీమార్‌’. తమన్నా, దిగంగన కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీ¯Œ   పతాకంపై  శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. నేడు గోపీచంద్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ‘సీటీమార్‌’ టీమ్‌ కొత్త స్టిల్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ–‘‘కబడ్డీ నేపథ్యంలో నిర్మిస్తున్న చిత్రమిది. ఈ ఏడాదే షూటింగ్‌ మొదలుపెట్టాం. కానీ లాక్‌ డౌన్‌కి ముందే మూడు షెడ్యూల్స్‌లో 60 శాతం చిత్రీకరణ పూర్తి చేశాం.

మిగిలిన భాగం చిత్రీకరణ ఆగస్ట్‌ మొదటివారంలో మొదలుపెట్టి ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నాం. ఒక పాట మినహా ఇప్పటికే నాలుగు పాటలు రికార్డ్‌ చేశారు సంగీత దర్శకుడు మణిశర్మ. మాస్‌ ప్రేక్షకుల కోసం ఒక ప్రత్యేక గీతాన్ని కంపోజ్‌ చేస్తున్నారాయన. సౌందర్‌ రాజన్‌ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌లా ఉండబోతుంది’’ అన్నారు. కాగా ‘సీటీమార్‌’ చిత్రంలో ఆంధ్ర కబడ్డీ టీమ్‌ కోచ్‌గా గోపీచంద్, తెలంగాణ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా తమన్నా నటిస్తున్నారు. పల్లెటూరిలో ఉండి హీరోని ప్రేమించే ప్రత్యేక పాత్రలో దిగంగన నటిస్తున్నారు. ఈ సినిమాకి సమర్పణ: పవ¯Œ  కుమార్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు