రోజురోజుకీ నష్టం పెరుగుతోంది 

3 Jul, 2020 04:10 IST|Sakshi

థియేటర్స్‌ రీ ఓపెన్‌కి అనుమతించాలి 

దేశవ్యాప్తంగా నాన్‌ కంటైన్మెంట్‌ జోన్స్‌లోని థియేటర్స్‌ను రీ ఓపెన్‌ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని మినిస్టరీ ఆఫ్‌ హోమ్‌ అఫైర్స్‌ను మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కోరింది. ఇందుకు సంబంధించి ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఈ నోట్‌ సారాంశం ఇలా... ‘‘కేంద్రప్రభుత్వం అన్‌ లాకింగ్‌ 2.0 గైడ్‌లైన్స్‌లో కూడా థియేటర్స్‌ను రీ ఓపెన్‌ చేసుకునే వెసులుబాటు కల్పించలేదు. నిజానికి సామాజిక దూరం, క్రౌడ్‌ను కంట్రోల్‌ చేయడం వంటి అంశాలను థియేటర్స్‌ యాజమాన్యం సమర్థవంతంగా నిర్వహించగలదని మేం నమ్ముతున్నాం. దేశవ్యాప్తంగా మా ద్వారా దాదాపు రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా వేలల్లో ఉపాధి పొందుతున్నారు. థియేటర్స్‌ మూసివేయడం వల్ల మా నష్టం రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అలాగే సినిమా ఇండస్ట్రీపై ఆధారపడి జీవిస్తున్న వారి ఇబ్బందులు కూడా పెరుగుతు న్నాయి. నిజానికి మేం థియేటర్స్‌ను ఓపెన్‌ చేసినప్పటికీ మునుపటి రోజులు రావటానికి సమయం పడుతుంది. మరోవైపు ప్రేక్షకులను థియేటర్స్‌కు ఆకర్షించే కంటెంట్‌పై దృష్టి పెట్టాలి. ఇటువంటి సవాళ్లు కూడా ఉన్నాయి. కానీ ఈ చాలెంజెస్‌ను ప్రభుత్వ ప్రోత్సాహంతో అధిగమిస్తామని నమ్ముతున్నాం. ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, హాంకాంగ్, ఇటీవల బెల్జియం, మలే షియా వంటి దేశాల్లో సినిమాల ప్రదర్శనలకు నియంత్రణలతో కూడిన అవకాశం కల్పించారు. ఇతర సెక్టార్స్‌లోని వాటికి అనుమతులు ఇచ్చిన మాదిరిగానే దేశవ్యాప్తంగా నాన్‌ కంటైన్మెంట్‌ జోన్స్‌లో సినిమాల ప్రదర్శనలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరు కుంటున్నాం’’ అని పేర్కొంది మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా