జయంత్ సినిమాలో రెజ్లింగ్ స్టార్‌

30 Jan, 2019 09:58 IST|Sakshi

మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు లాంటి టాప్‌ స్టార్లను డైరెక్ట్‌ చేసిన స్టైలిష్ డైరెక్టర్ జయంత్‌ సీ పరాన్జీ. కమర్షియల్ ఎంటర్‌టైనర్లతో ఆకట్టుకున్న  జయంత్ కొంత కాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. చివరగా గంటా రవితేజను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన జయదేవ్‌ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు జయంత్‌. మరోసారి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన నిలేష్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కిస్తున్నాడు జయంత్‌. ‘నరేంద్ర’ అనే టైటిల్‌ తో యాక్షన్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈషన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతోంది. ఈ సినిమాలో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌ స్టార్ ద గ్రేట్‌ ఖలీ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

మరిన్ని వార్తలు