యాత్ర పాటతో ఆకట్టుకుంటున్న చిన్నారి

23 Feb, 2019 14:04 IST|Sakshi

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ అప్రతిహతంగా దూసుకుపోతోంది. కలెక్షన్ల జోరుతోపాటు విమర్శకుల ప్రశంసలను సైతం చేసుకుంటోంది. ప్రేక్షకుల ఆదరణ విషయంలో వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ శ్రేణులనే కాదు.. చిన్నా పెద్దా అందరినీ ఆకట్టుకుంటూ తన పత్ర్యేకతను నిలబెట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాలోని  హిట్‌ సాంగ్‌ సమర శంఖం పాటను అలవోకగా ఆలపించడం పలువురిని  ఆకర్షిస్తోంది. కఠినమైన పదాలు కలిగిన పాటను కూడా చాలా ఈజీగా పాడుతోందనీ,  యాత్ర సినిమాను ప్రజలు ఎలా గుండెల్లో పెట్టుకున్నారో  చూడండి అంటూ సినిమా దర్శకుడు మాహి వి రాఘవ్‌ దీన్ని ట్వీట్‌ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.
 
కాగా వి రాఘవ్ దర్శకత్వంలో వైఎస్ఆర్ పాత్రను ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి పోషించిన సంగతి తెలిసిందే.  ‘సమర శంఖం’    పాటను ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించగా, కీరవాణి తనయుడు  కాల భైరవ ఆలపించారు

మరిన్ని వార్తలు