సమస్య చుట్టూ అల్లుకున్న సరదా

13 Apr, 2014 23:11 IST|Sakshi
సమస్య చుట్టూ అల్లుకున్న సరదా

సామాజిక సమస్యలకి వినోదాన్ని మేళవించి యువతరమే లక్ష్యంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గ్రీన్ సిగ్నల్’. రేవంత్, మానస్, గోపాల్‌సాయి, అశుతోశ్, ‘బస్‌స్టాప్’ ఫేం రక్షిత, శిల్పి శర్మ, మనాలి రాథోడ్, భార్గవి ముఖ్య తారలు. విజయ్ మద్దాల దర్శకుడు. రుద్రపాటి రమణరావు నిర్మాత. మారుతి సమర్పకుడు. మే రెండోవారంలో విడుదల చేయనున్న ఈ చిత్రం గురించి నిర్మాత చెబుతూ-  ‘‘విజయ్ చక్కని కథ చెప్పారు. జె.బి. స్వరాలందించిన పాటలను ఈ నెల 18న విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: రామస్వామి, కెమెరా: ఆర్.ఎం. స్వామి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: జి.పి.ఆర్.రాజు, ఎస్.కె.ఎన్, జి.శ్రీనివాసరావు.
 

>